వరుణ్ సందేశ్ కెరీర్ లో.. హిట్ సినిమాలు ఎన్నో తెలుసా?

వరుణ్ సందేశ్.. ఒకప్పుడు యూత్ అందరినీ తన వైపు తిప్పుకోవడం లో సక్సెస్ అయిన హీరో. యూత్ ని టార్గెట్ గా చేసుకుంటూ ఎన్నో సినిమాలు చేసి అందర్నీ మెస్మరైజ్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు వరుణ్ సందేశ్. హ్యాపీ డేస్ అనే సినిమాతో టాలీవుడ్ హీరోగా పరిచయమైన వరుణ్ సందేశ్ ఆ తర్వాత కొత్త బంగారు లోకం అనే సినిమాతో యూత్ లో ఎంతగానో క్రేజ్ సంపాదించుకున్నాడు. బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత కూడా వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. కానీ ఆ తర్వాత మాత్రం సరైన కథలు ఎంచుకోక పోవడంతో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు వరుణ్ సందేశ్.

 

దీంతో ఇక ఇప్పుడు వరుణ్ సందేశ్ కి అవకాశాలు కూడా రావడం లేదు అని చెప్పాలి. కాగా వరుణ్ సందేశ్ కెరీర్ లో ఇప్పటి వరకు మంచి విజయం సాధించిన సినిమాలు ఏవి అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సినిమా లు ఏవో తెలుసుకుందాం. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన మొదటి చిత్రం హ్యాపీ డేస్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత వచ్చిన కొత్త బంగారులోకం సినిమా వరుణ్ సందేశ్ కు యూత్ లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇక ఆ తర్వాత వచ్చిన ఎవరైనా ఎప్పుడైనా, కుర్రాడు సినిమాలు కూడా హిట్ గా నిలిచాయి.

భారీ అంచనాల మధ్య వచ్చిన మరో చరిత్ర సినిమా పరవాలేదు అనిపించింది. ఇక ఆ తర్వాత వరుణ్ సందేశ్ ‘ఏమైంది ఈ వేళ’ సినిమాతో మరో హిట్టు అందుకున్నాడు. ఇక ఆ తర్వాత నటించిన బ్రహ్మ గాడి ప్రేమ కథ, కుదిరితే ఒక కప్పు కాఫీ సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ పర్వాలేదు అనిపించాయి. ఇక ఆ తర్వాత ప్రియుడు, చమ్మక్ చల్లో,ప్రియతమా నీవచట కుశలమా, ఒక అమ్మాయితో, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ అంటూ వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ వరుణ్ సందేశ్ కెరీర్లో అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి ఈ సినిమాలు. ఇక ఆ తర్వాత వచ్చిన డి ఫర్ దోపిడి, నువ్విలా నేనిలా సినిమాలు ఓకే అనిపించాయి. ఇక ఆ తర్వాత పాండవులు పాండవులు తుమ్మెద సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఈ వర్షం సాక్షిగా, పడ్డానండి ప్రేమలో మరి, మామ మంచు అల్లుడు కంచు, లవకుశ, మిస్టర్ 420, మర్ల పులి, ఇందువదన మూవీస్ ఫ్లాప్ గానే మిగిలిపోయాయి. ఇలా వరుణ్ సందేశ్ కెరీర్లో హిట్ లతో పోల్చి చూస్తే ఫ్లాప్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి.

Share post:

Latest