చాలా ఆఫర్లు వచ్చాయి.. కానీ నేను అందాన్ని అమ్ముకోలేను : బిగ్‌బాస్ బ్యూటీ

డ్రెస్సింగ్‌తో బాగా సోషల్ మీడియాలో తరచుగా ట్రోలింగ్ గురవుతూ ఎప్పుడు లైం లైట్లో ఉంటుంది ఉర్ఫీ జావేద్ . అంతేకాకుండా బిగ్ బాస్ తో పాపులారిటీ సంపాదించిన నటి ఉర్ఫీ జావేద్. ఎలాంటి బెరుకు లేకుండా అందరితో తన మనసులోని ఆలోచనలను పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ భామ ‘ఉల్లు’ టైప్ వెబ్‌సిరీస్‌ల గురించి బోల్డ్‌గా మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది.

ఆమెకు సెక్సువల్ కంటెంట్‌తో ఉండే వెబ్‌సిరీస్‌లో చాలా ఆఫర్లు వచ్చినట్లు వెబ్‌ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో ఉర్ఫీ చెప్పింది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను మంచి ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నా. అంతేకానీ సెక్స్‌ని అమ్ముకునే వెబ్‌సిరీస్‌లు చేయను. అంటే అలాంటి అవరసరమైతే చేయొచ్చు కానీ ప్రత్యేకంగా వాటి గురించే అయితే చేయను. నా దుస్తులు చాలా బోల్డ్‌గా ఉండడం వల్ల నాకు ఎన్నో అలాంటి వాటిలో ఆఫర్లు వచ్చాయి. నాకు అందాన్ని అమ్ముకోవడం ఇష్టం లేదు. అందుకే అలాంటి వాటిని చేయడానికి సిద్ధంగా లేన‌’ని చెప్పుకొచ్చింది.

అయితే బాలీవుడ్ లో బోల్డ్ సీన్స్‌ని విమర్శించిన వాళ్లలో ఉర్ఫీని మొదటిది కాదు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం తన సినిమాలు కుంటుంబం మొత్తం కలిసి చూసేలా ఉండాలని చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే ఈ బ్యూటీ తన కెరీర్‌లోని బ్యాడ్ ఫేజ్‌ గురించి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించింది.

Share post:

Popular