రమేష్ బాబు ని కాదని ఆర్ నారాయణ మూర్తిని కొట్టి దాసరి..మూర్తి ఏమన్నాడో తెలుసా?

నీడ.. మహేస్ బాబు అన్న రమేష్ బాబు నటించి సినిమా. కేవలం 14 ఏండ్ల వయసులోనే తను హీరోగా ఈ సినిమాలో నటించాడు. కేవలం 10 రోజుల్లోనే దర్శకుడు దాసరి నారాయణ రావు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఎదిగే పిల్ల‌ల‌పై ఆయా కారణాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే విషయాన్ని ఇందులో చూపించాడు దాసరి. పక్కన ఉండే వాతావ‌ర‌ణం, ప‌రిస్థితులు, చుట్టుప‌క్క‌ల వారి మ‌న‌స్త‌త్వం, సినిమాలు యువకులపై ఎలాంటి ఇంపాక్ట్ కలిగిస్తాయో ఇందులో వెల్లడించారు. ఈ సినిమాలో రమేష్ బాబుతో పాటు మరో కీరోల్ ఆర్ నారాయణ మూర్తి పోషించాడు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నటించిన వారికి మంచి పేరు తీసుకువచ్చింది.

1979 మార్చి 5న నీడ షూటింగ్ మొదలైంది. విజ‌య‌వాడ‌ వెంక‌టేశ్వ‌ర థియేట‌ర్ ఆవ‌ర‌ణ‌లో చిత్రీకరణ మొదలు పెట్టారు. రమేష్ బాబు మీదనే తొలి షాట్ తీశారు. సినిమా షూటింగ్ సమయంలో రమేష్, నారాయణ మూర్తి మధ్యన ఓ సన్నివేశం ఉంటుంది. ఈ సీన్ లో దాసరి ఎంతగా వివరించినా.. నారాయణమూర్తి సరిగా చేయలేకపోతున్నాడు. దాంతో దాసరికి విసుగు వచ్చింది. వెంటనే నారాయణమూర్తిని ఫట్ మని కొట్టాడు. అంత మంది ముందు తనను కొట్టే సరికి నారాయణమూర్తికి బాగా కోపం వచ్చింది. అదేంటి గురువు గారూ రమేష్ బాబు అన్నిటేకులు తీసుకున్నా ఏం అనలేదు.. నన్ను మాత్రమే కొట్టారు? అని అడిగాడు. దాంతో దాసరి మరోసారి కొట్టాడు.

అప్పుడు దాసరి అసలు విషయం చెప్పారు. ర‌మేశ్‌ బాబు ఈ సినిమాలో వేషం కావాల‌ని అడ‌గ‌లేదు. నిర్మాత‌లు అత‌నే కావాల‌నుకొని వెళ్లి అడిగారు. అమ్మానాన్న‌లు, ఊరు వ‌దులుకుని సినిమాల్లోకి వచ్చావు నువ్వు. నిన్ను మంచి నటుడిగా తీర్చిద్దిద్దాలి అనేదే నా బాధ్యత అన్నాడు. దాసరి మాటలకు మూర్తి సరే అన్నట్లుగా తల ఊపాడు. ఈ సినిమాకు దాసరి కథ, మాటలు రాశాడు. దర్శకత్వం, స్క్రీన్ ప్లే కూడా తనే చూసుకున్నాడు. నాలుగు సెంటర్లలో ఈ సినిమా 100 రోజులుల ఆడింది.