టాలీవుడ్లో విషాదం ..ప్రముఖ డైరెక్టర్ మృతి

టాలీవుడ్ లో 2021 వ ఇయర్ ఎన్నో చేదు జ్ఞాపకాలు మరవకముందే ,కొత్త ఇయర్ లో సీనియర్ డైరెక్టర్ ప్రముఖ సినీ దర్శకుడు పి.చంద్ర శేఖర్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం దాదాపు 8.30 నుండి 9 .00 గంటల వ్యవధిలో అయన చెన్నై లో మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు…దాదాపు 80 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించగా , నాటి మేటి సూపర్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోల చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అయితే, అయన అందరి కంటే సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలకు ఆయన ఎక్కువగా దర్శకత్వం వహించారు.

గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు పి.సి.రెడ్డి . అయన అందరికి పీ.సి రెడ్డి గా తెలిసిన అయన పూర్తి పేరు పందిళ్లపల్లి చంద్రశేఖరరెడ్డి. ఆయన 1933, అక్టోబర్ 15వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అనుమసముద్రం గ్రామంలో పందిళ్లపల్లి నారపరెడ్డి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. 1959లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీరంగ ప్రవేశం అయన నాటి గొప్ప దర్శకులైన వి.మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయ దర్శకుడిగా, సహ దర్శకుడిగా పని చేశారు.పీ సి రెడ్డి గారు అనూరాధ అనే సినిమాకు మొదటి సారి దర్శకత్వం వహించారు.

Share post:

Popular