ప్రేమలో మునిగి తేలుతున్న సినీస్టార్స్ వెళ్లే !

సినిమా పరిశ్రమలో డేటింగులు, ప్రేమలు ఎంత కామనో.. విడిపోవడం కూడా అంతే మామూలు. నచ్చితే కలిసి ఉంటారు. నచ్చకపోతే విడిపోతారు. వీటి గురించి పెద్దగా ఆలోచించరు. అలాగే సినిమా పరిశ్రమకు చెందిన పలువురు హీరో, హీరోయిన్లు చట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన జంట ఒకటి. వీళ్లద్దరి మధ్య ఏదో జరుగుతుంది అనే టాక్ నడుస్తోంది. వీరిద్దరు చాలా సార్లు ముంబైలో డిన్నర్ డేట్ చేశారు. చాలా సార్లు వీరు కలిసి కనిపించారు కూడా. ఇప్పటి వరకు తమది ఫ్రెష్డిప్ అని చెప్పిన ఈ జంట.. తాజాగా ఏం చెప్తాడో చూడాలి.

అటు అనన్యపాండే షాహిద్ కపూర్ బ్రదర్ ఇషాన్ కట్టర్ తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి కలీపీలీ అనే సినిమా చేశారు. అప్పుడే వీరిద్దరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. సినిమా అయిపోయే సరికి వీరి ప్రేమ గట్టిపడినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా వీరిద్దరు రాజస్థాన్ లో న్యూఇయర్ వేడుకలు చేసుకున్నారట. అటు కియారా, సిద్ధార్థ్ కూడా ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరు మంచి ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. వీరిద్దరు ముంబై వీధుల్లో చక్కర్ల కొడుతూ పలుమార్లు కనిపించారు కూడా. అటు టైగర్ ష్రాఫ్, దిశా పఠానీ కూడా ప్రేమలో కొనసాగుతున్నారు. వాళ్లు పెట్టే ఫోటోలు, వీడియోలు ఈ విషయాన్ని చెప్తున్నాయి.

రణ్ బీర్, అలియా భట్ డేటింగ్ లో ఉన్నారు. ఈ ఏడాది వారు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరు తమ పెళ్లి గురించి మాత్రం అఫీషియల్ గా చెప్పలేదు. అధునా బబానీ నుంచి వేరయిన తర్వాత శిబానీ దండేకర్ తో ప్రేమలో పడ్డాడు ఫర్హాన్ అక్తర్. వీళ్లు కూడా పెళ్లి పీటలు ఎక్కుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అర్బాజ్ ఖాన్ తో విడిపోయిన తర్వాత మలైకా.. అర్జున్ కపూర్ తో ప్రేమాయణం నడుపుతోంది. ఇద్దరికీ 12 ఏళ్లు వయసులో తేడా ఉంది. అయినా ప్రేమగా గడుపుతున్నారు. అటు హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుసానే ఖాన్‌… యాక్టర్ అర్స్ లాన్ తో ప్రేమలో పడింది.

Share post:

Latest