తెలుగు సినిమా స్టార్స్ ఏ వయసులో పెళ్లి చేసుకున్నారో తెలుసా?

ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది. ఇద్దరు వ్యక్తులు ఒక్కటిగా జీవితాన్ని మొదలు పెట్టే సందర్భం. అయితే ఎవరి పెళ్లి ఎవరితో అవుతుందో చెప్పడం కష్టం. సినిమా పరిశ్రమలో ఉన్న వారి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అయితే పలువురు తెలుగు సినిమా తారల చాలా త్వరగానే పెళ్లి చేసుకున్నారు. మరికొంత మంది 40 ఏండ్లు వచ్చినా పెళ్లి చేసుకోని వాళ్లు ఉన్నారు. ఇంతకీ మన సినిమా హీరోలు ఏ వయసులో వివాహ బంధంలోకి అడుగు పెట్టారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఎన్టీఆర్
20 ఏండ్ల వయసులో ఆయన బసవతారకంను పెళ్లి చేసుకున్నాడు.

ఏఎన్నార్
25 సంవత్సరాల వయసులో అన్నపూర్ణను మ్యారేజ్ చేసుకున్నాడు.

శోభన్ బాబు
శోభన్ బాబు 21 సంవత్సరాల వయసున్నప్పుడు శాంతా దేవిని కట్టుకున్నాడు.

కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ 19 సంవత్సరాల వయసులోనే ఇందిరా దేవిని వివాహం చేసుకున్నాడు.

రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 30 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఒక జర్నలిస్టును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

చిరంజీవి
చిరంజీవి 24 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకున్నాడు.

బాలకృష్ణ
బాలయ్య తనకు 22 సంవత్సరాల వయసున్నప్పుడు వసుంధరాదేవిని కల్యాణం చేసుకున్నారు.

కమలహాసన్
లోక నాయకుడు కమల్ 24 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సారిక ను వివాహం చేసుకున్నాడు. ఈయనకు అంతకుముందే మొదటి భార్య వాణి గణపతి తో వివాహం జరిగింది.

నాగార్జున
అక్కినేని నాగేశ్వర్ రావు నట వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన నాగార్జున 24 సంవత్సరాల వయసులో వెంకటేష్ సోదరి లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వీరు విడిపోయారు. అమలను రెండో వివాహం చేసుకున్నాడు.

రాజశేఖర్
నటుడు రాజశేఖర్ తన 30 సంవత్సరాల వయసులో సహా నటి జీవితను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు. వీరు కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు.