రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన టాలీవుడ్ యాక్టర్స్ ఎవరో తెలుసా?

సినిమా హిట్ అయితే ఏ సమస్య ఉండదు.. ఫ్లాప్ అయితేనే చాలా ఇబ్బందులు వస్తాయి. సినిమాను నమ్ముకున్న ఎంతో మంది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. నిర్మాతల విషయం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయితే కొందరు హీరోలు మాత్రం నిర్మాతలు నష్టపోకూడదు అని ఎప్పుడూ అనుకుంటారు. సినిమా ఫ్లాప్ అయితే.. తమ రెమ్యునరేషన తీసుకోని వారు కొందరు ఉంటే.. తీసుకున్న రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన వారు కూడా మరికొంత మంది ఉన్నారు. ఇంతకీ తెలుగు సినిమా పరిశ్రమలో తీసుకున్న రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. వాస్తవానికి రెమ్యునరేషన వెనక్కి ఇచ్చిన నటుల్లో చాలా మంది ఉన్నారు. అయితే కొందరి గురించి ఇప్పుడు చూద్దాం..

*మహేష్ బాబు
ఈయన హీరోగా చేసిన సినిమా ఖలేజా. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం చవి చూసింది. అయితే తన రెమ్యునరేషన్ లో సగం నిర్మాతకు తిరిగి ఇచ్చేశాడు.

* పవన్ కళ్యాణ్
ఈయన నటించిన జానీ, పులి ఫ్లాప్‌ అయ్యాయి. అయితే తన పారితోషికంలో 40 శాతం నిర్మాతలకు తిరిగి ఇచ్చాడు.

*రాంచరణ్
ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయ్యాక.. రాంచరణ్ తన రెమ్యునరేషన్ లో 30 శాతం తిరిగి వెనక్కి ఇచ్చాడు.

*జూనియర్ ఎన్టీఆర్
నందమూరి హీరో ఎన్టీఆర్ నటించిన నరసింహుడు ఫ్లాప్ అయ్యింది. దీంతో సగం రెమ్యునరేషన్ నిర్మాతకు ఇచ్చాడు.

*త్రివిక్రమ్
మాటల మాంత్రికుడు తెరకెక్కించిన సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో తన రెమ్యునరేషన్ లో 20 శాతం తిరిగి ఇచ్చాడు.

* బాలకృష్ణ
బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి ఫ్లాప్ అయ్యింది. ఈ నేపథ్యంలో బాలయ్య సగం రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నాడు.

*రాంచరణ్, దానయ్య
వినయవిధేయరామ సినిమా ఘోర పరాజయం పొందింది. దీంతో దానయ్య, రాంచరణ్ డిస్ట్రిబ్యూటర్లకు 5 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చారు.

* సాయి పల్లవి
ఈమె హీరోయిన్ గా చేసిన సినిమా పడి పడి లేచే మనసు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. దీంతో తన రెమ్యునరేషన్ మొత్తాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చింది.

Share post:

Latest