ఎన్టీఆర్ తెలుగులో నటించిన ఆ 3 బ్లాక్ బస్టర్లు.. అక్కడ ఘోరమైన డిజాస్టర్లు.. కారణం ఇదే?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలకు కొదవలేదు. ఒక రకంగా చెప్పాలంటే రీమేక్ సినిమాలే మరింత సులభం. ఎందుకంటే సినిమా కోసం కొత్తగా కథ రాసుకోవాల్సిన అవసరం లేదు.. ఉన్న కథలో కాస్త మార్పులు చేస్తే చాలు. ఇలా ఎంతో మంది దర్శక నిర్మాతలు రీమేక్ సినిమాలతో సూపర్ హిట్ లు అందుకుంటున్నారు. కానీ కొంతమంది దర్శక నిర్మాతలు మాత్రం సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి నష్టాల్లో కూరుకుపోతున్నారు.

 

ఇలా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ నిలబెట్టిన కొన్ని హిట్ సినిమాలపై కన్నేసిన కోలీవుడ్ దర్శకనిర్మాతలు తమిళంలో భారీ అంచనాల మధ్య తెరకెక్కించారు. కానీ నష్టాలు మాత్రం తప్పలేదు. ఇంతకీ ఆ సినిమాలో ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

దర్శక ధీరుడు రాజమౌళి మొదటి సినిమా.. జూనియర్ ఎన్టీఆర్ ను హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో దర్శకుడిగా రాజమౌళికి హీరోగా ఎన్టీఆర్కి కూడా మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమాను సెల్వ దర్శకత్వంలో శివరాజ్ హీరోగా తమిళంలో రీమేక్ చేయగా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది సినిమా.

వివి వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా ఆది. ఫాక్షన్ సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కు మాస్ ఫాలోయింగ్ తీసుకోవడమే కాదు సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమా నారాయణ్ దర్శకత్వంలో ప్రశాంత్ హీరోగా తమిళంలో రీమేక్ చేయగా నిర్మాతలకు నష్టాలనే మిగిల్చింది ఈ సినిమా.

సాదా సీదా హీరోగా ఉన్న ఎన్టీఆర్ను స్టార్ హీరో గా మార్చింది సింహాద్రి సినిమా. ఎన్టీఆర్ కు మాత్రమే కాదు రాజమౌళి ని కూడా స్టార్ డైరెక్టర్ గా మార్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడమే కాదు వసూళ్లతో కూడా రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమా సురేష్ కృష్ణ దర్శకత్వంలో విజయ్ కాంత్ హీరోగా తమిళంలో రీమేక్ చేయగా అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది ఈ సినిమా.

Share post:

Popular