2022 : తెలుగు సినిమా పై తమిళ హీరో దండయాత్ర

హీరోలతో సంబంధం లేకుండా సినిమా బాగుంటే చాలు ఆదరిస్తూ మంచి విజయాన్ని అందిస్తూ వుంటారు తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఎంతో మంది తమిళ హీరోలు తమ సినిమాల్ని తెలుగులో కూడా డబ్ చేస్తూ ఉంటారు.. అయితే ఇటీవలి కాలంలో ఎంతోమంది తెలుగు హీరోలు పాన్ ఇండియా స్టార్ లుగా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నారు. దీంతో ఒకప్పటిలా వేగంగా సినిమాలను చేయడం లేదు. ఇలాంటి నేపథ్యంలో అటు టాలీవుడ్ ప్రేక్షకుల నిరీక్షణ క్యాష్ చేసుకునేందుకు తమిళ హీరోలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగులో కూడా డబ్ చేయగా.. ఇప్పుడు నేరుగా తెలుగులోనే నటించేందుకు తమిళ హీరోలు సిద్ధమవుతున్నారట.

ఇక టాలీవుడ్ లో కూడా తమ మార్కెట్ ను పెంచుకోవాలని ఎంతో మంది తమిళ హీరోలు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నాడట హీరో ధనుష్. ధనుష్ సినిమాలంటే యూత్ లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో సినిమాలను తెలుగులో డబ్ చేసి అలరించాడు. ఇక ఇప్పుడు నేరుగా తెలుగులో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు ధనుష్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ అనే తెలుగు సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడట. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక మరో హీరో శివ కార్తికేయన్ కూడా టాలీవుడ్ పై కన్నేసినట్టు తెలుస్తోంది.. ఎప్పటికి తన సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

 

ఇప్పుడు జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో కలిసి ఒక సినిమాను పట్టా లెక్కించేందుకు సిద్ధమయ్యాడట. ఇక నేరుగా తెలుగు సినిమా చేసి తెలుగు ప్రేక్షకులను అలరించాలి అనుకుంటున్నాడట. ఈ సినిమా నిర్మించేందుకు బడా నిర్మాతలు కూడా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు తమిళ ఇండస్ట్రీలో ఇళయదళపతి గా పేరు తెచ్చుకున్న విజయ్ కూడా తన మార్కెట్ మరింత పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఈ క్రమంలోనే తెలుగులో నేరుగా సినిమా చేయడానికి సిద్ధమయ్యాడట. తన 68వ సినిమా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించి పోతున్నాడట. ఇలా టాలీవుడ్ పై తమిళ హీరోల కన్ను పడిందని ఇక వరుసగా సినిమాలతో దండ యాత్ర మొదలు పెట్టబోతున్నారు అంటూ సినీ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest