బాలీవుడ్ ను దున్నేయబోతున్న టాలీవుడ్ డబ్బింగ్ మూవీస్..

ఒకప్పుడు మన సినిమాలు కేవలం మన రాష్ట్రంలోనే విడుదల అయ్యేవి. కాదంటే కొన్ని పక్క రాష్ట్రాల్లో డబ్ అయి విడుదలయ్యేవి. అక్కడ పెద్ద హవా ఏమీ చూపించేవి కాదు. మరికొంత కాలం తర్వాత కొన్ని సినిమాలను హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేసేవారు పలువురు నిర్మాతలు. ఇతర సినిమాలు మాత్రం తెలుగు తెరపై డబ్బై విడుదలయ్యేవి. తమిళ సినిమాలు ఎక్కువగా తెలుగులోకి వచ్చేవి. అయితే ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కతున్నాయి. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా విడుదల అవుతున్నాయి. ఆయా భాషల్లో తెలుగు హీరోలు సత్తా చాటుకుంటున్నారు. ప్రస్తుతం మన వాళ్లంతా పాన్ ఇండియన్ స్టార్స్ గా మారి బాలీవుడ్ తెరపై సందడి చేయబోతున్నారు.

తాజాగా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ హిందీ సినీ పరిశ్రమలో దుమ్మురేపాడు. ఈ సినిమా హిందీ వర్షన్ రూ. 100 కోట్లను సునాయాసంగా సాధించింది. దీంతో నార్త్ లో బన్నీ సినిమాలపై జనాలకు ఇంట్రెస్ట్ పెరిగింది. దీందో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాను హిందీలో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఈ నెల 26న ఈ సినిమా హిందీలో రిలీజ్ అవుతుంది. అంతేకాదు.. ఈ సినిమాను హిందీలో షెహజాదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. అల్లు అర్జున్ రోల్ లో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు. పూజా హెగ్డే పాత్రలో కృతి సనన్ నటిస్తుంది. అల్లు అరవింద్ కూడా ఈ సినిమా నిర్మాణంలో ఉన్నాడు.

మరోవైపు రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా కూడా డబ్బింగ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాను కూడా గోల్డ్ మైన్స్ ప్రొడక్షన్ హౌస్ డబ్బింగ్ రైట్స్ తీసుకుంది. అయితే ఈ సినిమా త్రిఫుల్ ఆర్ సినిమా విడుదలైన తర్వాతే విడుదల కానుంది. అటు బాహుబలి సినిమాతో సత్తా చాటుకున్న ప్రభాస్.. సినిమాలు కూడా పలు డబ్ అవుతున్నాయి. సాహోతో డైరెక్ట్ గా హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయనను ప్రస్తుతం నార్త్ జనాలు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాత సినిమాలను హిందీలోకి డబ్ చేయడానికి రెడీ అవుతున్నారు.