ఆ కోరిక తీరకుండానే కాలం చేసిన స్టార్ హీరోయిన్..!!

సినీ ఇండస్ట్రీలోకి చాలామంది ఎన్నో రకాల ఆలోచనలతో, కోరికలతో అడుగు పెడుతూ ఉంటారు.అలా తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఎంతటి సాహసమైన చేస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ఒక్కొక్కసారి తమ కోరికలు నెరవేర్చుకునే సమయంలోని అనుకోకుండా స్వర్గస్తులు అవుతూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ సౌందర్య కూడా ఒకరు.. కన్నడ ముద్దుగుమ్మ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యి . ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందింది.
అందాల నటి గా, అపురూప సౌందర్యవతి గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సౌందర్య తన కోరికను నెరవేర్చుకోకుండానే స్వర్గానికెగిసింది.

నాటి నుంచి నేటి వరకు ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి కళ్ళముందు ఈ అందాల తార ప్రత్యక్షమవడంతో పాటు ఆమె లేదనే బాధ కూడా కళ్ళవెంట కన్నీరు రూపంలో బయటకు వస్తుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగింటి ఆడపడుచులా అందర్నీ చక్కగా అలరించింది.పది సంవత్సరాలకు పైగా దక్షిణ సినీ ఇండస్ట్రీని స్టార్ హీరోయిన్ గా ఏలిన ఈ ముద్దుగుమ్మ .. సావిత్రి తర్వాత మరో సావిత్రిగా తిరుగులేని గుర్తింపును.. అభిమానులను సొంతం చేసుకుంది.

పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించిన సౌందర్యకు తెలుగు ఆడియన్స్ వారి గుండెల్లో గుడి కట్టారు. అంతే కాదు ఎటువంటి సినిమాలో నటించినా సరే వస్త్రధారణ విషయంలో ఏమాత్రం హద్దులు దాటలేదు. సంప్రదాయమైన డ్రెస్ లోనే అందరికీ కనిపించి అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. అంతే కాదు ఆమె ను పాత్ర డిమాండ్ చేస్తే.. పాత్రకు తగినట్టు మోడ్రన్ డ్రస్సులు వేసిందే తప్ప.. పద్ధతికి విరుద్ధంగా ఏరోజు వ్యవహరించలేదు.. ఎక్కడా కూడా అశ్లీలంగా కనిపించేది కాదు.

ఇక అంతలా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యింది సౌందర్య. ఇకపోతే 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందింది.. ఇక ఈమె మరణం సినీ ఇండస్ట్రీలో శోకసంద్రంలా మారింది. ఇక సౌందర్య కల , కోరిక ఏమిటంటే ఆమె డైరెక్టర్ గా మారాలని.. కానీ తన కోరిక తీరకుండానే ఆమె చనిపోవడం సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Share post:

Popular