సూప‌ర్ స్టార్స్ కి మెమ‌ర‌బుల్ పొంగ‌ల్ డేట్ @ జ‌న‌వ‌రి 11

సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోలకు చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. పలానా డేట్ రోజు సినిమా విడుదల చేస్తే మంచి విజయాన్ని అందుకుంటుంది. ఫలానా దర్శకుడితో సినిమాలు చేస్తే సూపర్ హిట్ అవుతుంది. ఫలానా హీరోయిన్ తో జోడీ కడితే సక్సెస్ కు తిరుగుండదు.. ఫలానా నటుడిని తన సినిమాలో పెట్టుకుంటే హిట్ ఖాయం. పలానా హీరో తో పని చేస్తే విజయం మనల్ని వరిస్తుంది అనే టాక్ ఉంటుంది. అలాగే సూపర్ స్టార్ క్రిష్ణ ఫ్యామిలీ విషయంలోనూ ఓ వింత ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

తండ్రి సూపర్ స్టార్ క్రిష్ణ బాటలోనే కొనసాగుతున్నాడు మహేష్ బాబు. టాలీవుడ్ సూపర్ స్టార్ గా మంచి సక్సెస్ రేటుతో ముందుకు వెళ్తున్నాడు. గతంలో క్రిష్ణ సినిమాలు ఏ నెలలో ఎక్కువ విజయాలు అందుకున్నాయో.. మహేష్ విషయంలోనూ అదే కొనసాగుతుంది. క్రిష్ణ లాగే మహేష్ కూడా సంక్రాంతి హీరోగా పేరు సంపాదించుకున్నాడు. వీరిద్దరి సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పటి వరకు మహేష్ నటించిన చాలా సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయి.. మంచి హిట్ పొందాయి. 2003లో వచ్చిన ఒక్కడు, 2012లో వచ్చిన బిజినెస్ మేన్, 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 2020లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సహా పలు సినిమాలు ముగ్గుల పండుగ సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సరిలేరు నీకెవ్వెరు సినిమాలు జనవరి 11న విడుదలై మంచి సక్సెస్ అందుకున్నాయి. వసూళ్ల వర్షం కురిపించాయి.

అటు క్రిష్ణ విషయంలోనూ జనవరి 11 ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. 1985లో ఆయన నటించిన అగ్ని పర్వతం అనే సినిమా జనవరి 11న విడుదలై అద్భుత విజయాన్ని అందుకుంది. క్రిష్ణ డబుల్ యాక్షన్ చేసిన ఈ సినిమా అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాతో పాటు ఆయన నటించిన చాలా సినిమాలు జనవరి 11న విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి.

Share post:

Popular