నాలుక మడతేసిన నాగార్జున.. ఫుట్ బాల్ ఆడుకుంటున్న నెటిజన్లు

నాలుక మడతేయడం.. అన్ని రంగాలతో పాటు సినిమా రంగంలోనూ అనాదిగా వస్తోంది. తాజాగా ఈ లిస్టులో చేరాడు.. అక్కినేని నాగార్జున. ఒకే అంశం గురించి గతంలో ఒకలా.. ఇప్పుడు మరోలా మాట్లాడి అడ్డంగా బుక్ అయ్యాడు. తాజాగా ఆయన ఏపీలో టికెట్ ధరల తగ్గింపు గురించి స్పందించాడు. దీనికి సంబంధించి ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నెటజన్లు ఆయనను ట్రోలింగ్ చేస్తూ ఓ ఆట ఆడుకుంటున్నారు. టికెట్ల ధరల పెంపు గురించి గతంలో ఆయన మాట్లాడిన పాత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయన రెండు నాల్కల ధోరణిపై దుమ్మెత్తి పోస్తున్నారు. పలు రకాల మీమ్స్ తో ఓ ఆట ఆడుకుంటున్నారు.

- Advertisement -

తాజాగా బంగార్రాజు రిలీజ్ డేట్ ప్రకటన సందర్భంగా ఏపీలో టికెట్ ధరల తగ్గింపు అంశాన్ని ప్రస్తావించాడు ఓ జర్నలిస్టు. అయితే ఈ స్టేజి మీద రాజకీయాలు మాట్లాడనని చెప్పాడు నాగార్జున. అంతేకాదు.. ఏపీలో టికెట్ ధరలతో తనకు, తన సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించాడు. అక్కడ ఉన్న టికెట్ ధర తన సినిమాకు సరిపోతుందని చెప్పాడు. ఆయన మాటలు సినీ జనాలను ఆశ్చర్యానికి గురి చేశాయి. 2010లో రగడ సినిమా ఆడియో వేడుకలో నాగార్జున మాట్లాడిన మాటలను బయటకు తీశారు నెటిజన్లు. టికెట్ల ధరను పెంచాల్సిందిగా అప్పటి ముఖ్యమంత్రిని కోరాడు నాగార్జున. ప్రభుత్వాలు సినిమా పరిశ్రమ ఇబ్బందులను, సమస్యలను పట్టించుకోవడం లేదని చెప్పాడు. టికెట్ ధరల అంశం తన ఒక్కడిదే కాదని.. అందరు హీరోల సమస్య అని వెల్లడించాడు. కొత్తగా వచ్చిన సీఎం ఈ సమస్యను పరిష్కరిస్తాడని భావిస్తున్నట్లు నాగార్జున చెప్పాడు.

ఈ వీడియోను షేర్ చేసి నాగార్జునతో ఓ ఆట ఆడుకుంటున్నారు జనాలు. అప్పుడు సినిమా వేదిక నుంచి రాజకీయాలు మాట్లాడిన నాగార్జున ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేడని ప్రశ్నిస్తున్నారు. నాగార్జున ద్వందవైఖరిక ఇదే నిర్శనం అంటూ మండిపడుతున్నారు.

Share post:

Popular