50 ఏండ్లు దాటినా పెళ్లి మాటెత్తని ముదురు భామలు..

సినిమా పరిశ్రమ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొందరు హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలు చేసి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం.. మరికొందరు అవకాశాలను అందిపుచ్చుకుని ఫేడౌట్ అయ్యే సమయానికి మ్యారేజ్ చేసుకుని సెటిల్ అవుతారు. ఇంకొంత మంది మాత్రం 50 ఏండ్లు దాటిన పెళ్లి ముచ్చట ఎత్తరు. అయితే పలువురు టాప్ హీరోయిన్లుగా ఎదిగిన ముద్దుగుమ్మలు.. చాలా మందితో ప్రేమాయణం నడిపినా.. పెళ్లికి మాత్రం దూరంగా ఉంటున్నారు. తమ అందచందాలతో కుర్రకారుకు మత్తెక్కించిన ఈ ముద్దుగుమ్మలు.. పెళ్లికి మాత్రం ఎందుకు దూరంగా ఉంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

*టబు
50 ఏండ్లు దాటినా పెళ్లి చేసుకోని ముద్దుగుమ్మ టబు. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగింది. అప్పట్లో ఓ హీరోతో ప్రేమాయణం నడిపిందనే టాక్ వినిపించింది. అయితే పెళ్లి మూలంగా సంతోషాలను కోల్పోవాల్సి వస్తుందనే పెళ్లికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సరైన పార్ట్ నర్ దొరికితే డేటింగ్ చేస్తాను కానీ.. పెళ్లి మాత్రం చేసుకోను అంటుంది ఈ అమ్మడు.

*సుష్మితాసేన్
బోల్డ్ సినిమాలు చేయడంలో ఈమెకు ఈమే సాటి. వయసు ముదిరిపోతున్న ఒంటరి జీవితాన్నే గడుపుతుంది. అయితే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. రోమన్ షాల్ అనే వ్యక్తితో సహజీవనం చేసి.. వదిలేసింది.

*శోభన
క్లాసిక్ డ్యాన్సర్ గా గుర్తింపు పొందిన ఈ అమ్మడు.. క్లాస్ హీరోయిన్ గా అదరగొట్టింది. ప్రస్తుతం 51 ఏండ్లు దాటినా పెళ్లి మాత్రం చేసుకోలేదు. తన జీవితం నాట్యానికే అంకితం అంటుంది ఈ భామ.

*అమీషా పటేల్
ఒకప్పుడు టాప్ హీరోయిన్.. స్టార్ హీరోలతో కలిసి నటించి మెప్పించింది. తన జీవితంలో ఎంతో మంది మగాళ్లను చూసినా.. సరైన జోడీ అనే భావన కలగలేదట. అందుకే పెళ్లి చేసుకోలదంటుంది.

*నగ్మా
సౌత్ తో పాటు నార్తలోనూ దుమ్మురేపిన బ్యూటీ నగ్మ. తన గ్లామర్ తో సినీ జనాలను మత్తులో ముంచింది. 50 ఏండ్లు అయినా పెళ్లి మాత్రం చేసుకోలేదు. రెండు సార్లు బ్రేకప్ కావడంతో పెళ్లిపై ఇంట్రెస్ట్ పోయిందట.

*సితార
క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. తొలి నుంచి తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదని చెప్తుంది ఈ ముదురు భామ.

*నర్గీస్ ఫక్రీ
హిందీ సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ప్రతి ఏడాది ఓ కొత్త వ్యక్తితో ప్రేమలో పడుతుంది. దీని మూలంగానే ఆమె పెళ్లికి దూరంగా ఉంటుంది.