సమంత తన ప్రతి రోజు బిగినింగ్ ఎలా ఉంటుందో తెలుసా ?

సౌత్ ఇండియన హీరోయిన్ గా అద్భుత గుర్తింపు పొందిన హీరోయిన్ సమంతా. తొలి సినిమా ఏం మాయ చేసావె సినిమతోనే తెలుగు జనాలను ఏదో మాయ చేసింది. తన క్యూట్ మాటలు, అంతకు మించి నటనతో జనాలకు బాగా దగ్గరయ్యింది. ఆ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత సినిమా పరిశ్రమలో మంచి రేంజిలో కొనసాగుతుండగానే నాగ చైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పలు కారణాలతో తన వివాహ బంధానికి వీడ్కోలు పలికింది. ప్రస్తుతం పాత విషయాలన్నీ మర్చిపోయిన సినిమా కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టింది. తాజాగా పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ జనాలను బాగా ఆకట్టుకుంది. కుర్రకారులో సెగలు పుట్టించింది. పెళ్లికి బ్రేక్ చెప్పాక రోజు రోజుకు మరింత గ్లామర్ తో మరింత కైపెక్కిస్తోంది. అంతేకాదు.. వరుస అవకాశాలతో సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తోంది. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.

- Advertisement -

తన రోజు వారి పనుల గురించి ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రతి రోజు ఉదయం 5 గంటలకే నిద్ర లేస్తానని చెప్పింది. సూర్యోదయానికి ముందు లేవడం మూలంగా తనకు ఎంతో ఉల్లాసం కలుగుతుందని చెప్పింది. వ్యాయామం తప్పకుండా చేస్తానని వెల్లడించింది. వెయిట్ లిఫ్టింగ్ బాగా ఇష్టమని చెప్పింది. అటు ఫుడ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పింది. ఎక్కువగా కూరగాయాలు తింటానని చెప్పింది. శాకాహారమే తనకు చాలా ఇష్టమని వెల్లడించింది.

లేవగానే ఈ రోజు ఎలా ఉండాలో ముందుగా ఊహించుకుంటానని చెప్పింది. ఆ విషయాన్ని మనసులో అనుకుంటానని చెప్పింది. దీని మూలంగా ఆ రోజు చేసే ప్రతి పని ఈజీగా అయిపోతుందని వెల్లడించింది. వ్యాయామం, ధ్యానం, పెంపుడు జంతువులతో ఆడుకోవడం, టైం దొరికితే హాలీడేలకు వెళ్లడం చాలా సంతోషాన్ని ఇస్తాయని చెప్పింది. అంతేకాదు.. తన లైఫ్ విషయం మరెవరితో కంపార్ చేసుకోనని చెప్పింది. అలా చేసుకోవడం మూలంగా అనవర ఆలోచనలు పెరుగతాయని సమంతా వెల్లడించింది.

Share post:

Popular