రానా నటించిన సినిమాల్లో హిట్స్ ఎన్ని? ఫట్స్ ఎన్ని?

రానా.. తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని నిర్మాత, మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మనువడు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు తనయుడు. గట్టటి సినిమా బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రానా. ఆయన నటించిన తొలి మూవీ లీడర్ ఓ రేంజిలో విజయాన్ని అందుకుంది. తొలి చిత్రంతోనే సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన చక్కటి అవకాశాలను వినియోగించుకున్నాడు. పాజిటివ్ రోల్స్ తో పాటు నెగెటివ్ రోల్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఇండస్ట్రీలో సత్తా చాటుకున్నాడు. అయితే ఇంతకీ తను నటించిన సినిమాల్లో హిట్స్ ఎన్ని? ఫ్లాప్స్ ఎన్ని? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

రానా నటించిన తొలి సినిమా లీడర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత హీరోగా చేసిన నేను రాక్షసి మూవీ ప్లాప్ అయ్యింది. అనంతరం వచ్చిన నా ఇష్టం సినిమా కూడా బోల్తా కొట్టింది. నాలుగో సినిమా కృష్ణం వందే జగద్గురుమ్ మామూలుగా ఆడింది. ఆ తర్వాత తను నటించిన బాహుబలి సినిమాలో నెగెటివ్ రోల్ చేశాడు. అయితే ఈ సినిమా తనకు అద్భుతంగా పేరు తీసుకొచ్చింది. ఆయన నటనకు జనాలు ఫిదా అయ్యారు. ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా రేంజ్ ఏంటో చూపించింది. ఈ సినిమా అనంతరం రద్రమదేవి సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా చక్కటి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ఘాజీ సినిమా కూడా మంచి హిట్ అయ్యింది. బాహుబలి పార్ట్ -2 కూడా ఓ రేంజిలో సక్సెస్ అయ్యింది. రానాకు మంచి పేరు తీసుకొచ్చింది.

అనంతరం వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా సైతం మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత రానా నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, అరణ్య సినిమా పరాజయం పాలయ్యాయి. 1945 కూడా అంతగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో కలిసి నటించిన భీమ్లా నాయక్ విడుదలకు రెడీ అయ్యింది.