రమేష్ బాబు, జుహీ చావ్లా కలిసి జంటగా ఒక సినిమాలో నటించారని మీకు తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు చైల్డ్ ఆర్టిస్టుగా తన నటనతో మెప్పించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. సామ్రాట్ అనే సినిమాతో హీరోగా అవతారమెత్తాడు రమేష్ బాబు. మొదటి సినిమానే మంచి విజయం సాధించింది దీంతో కృష్ణ తర్వాత మరో సూపర్స్టార్ రమేష్ బాబు అని అనుకున్నారు అందరు. కానీ ఆ తర్వాత రమేష్ బాబు హీరోగా నటించిన అన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడం మొదలయ్యాయి. దీంతో కెరీర్ మొత్తం తలకిందులు అయిపోయింది. చిత్ర పరిశ్రమలో హీరోగా కేవలం 17 సినిమాల్లో మాత్రమే నటించారు రమేష్ బాబు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా అవతారమెత్తారు. ఇకపోతే ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అనారోగ్యం బారిన పడి హఠాత్ మరణం ఎంతో మందిని కలిచి వేసింది.

 

అయితే చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాల్లో నటించిన రమేష్ బాబు బాలీవుడ్ హీరోయిన్ జుహీ చావ్లా తో నటించిన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే జుహీ చావ్లా రమేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమాకి తండ్రి సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం వహించడం గమనార్హం. 1988లో కలియుగ కర్ణుడు అనే సినిమాను తెరకెక్కించారు సూపర్ స్టార్ కృష్ణ. ఈ సినిమాలో కృష్ణ, రమేష్ బాబు ఇద్దరూ కూడా హీరోలుగా నటించారు. ఇక కృష్ణ సరసన జయప్రద రమేష్ బాబు సరసన జుహీ చావ్లా హీరోయిన్లుగా నటించారు.

 

ఇక ఈ సినిమాతో జుహీ చావ్లా పేరును మీనా గా మార్చారు సూపర్ స్టార్ కృష్ణ. మీనా అనే పేరు తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇలా మార్చారట. ఇక ఆ తర్వాత మాత్రం జుహీచావ్లా అసలు పేరుతోనే మరికొన్ని సినిమాల్లో నటించడం గమనార్హం. అయితే ఇక కృష్ణ దర్శకత్వంలో వచ్చిన కలియుగ కర్ణుడు అనే సినిమాలో తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా అన్నదమ్ముల పాత్రల్లో నటించారు. అయితే కలియుగ కర్ణుడు సినిమాలోకి జుహీ చావ్లా తీసుకోవడానికి ఒక కారణం కూడా ఉందట. ప్రేమ లోక అనే కన్నడ సినిమాలో జుహీచావ్లా నటించగా ఈ సినిమా ప్రేమ లోకం అనే టైటిల్ తోనే తెలుగులో కూడా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సినిమాలో జుహీచావ్లా ని చూసిన కృష్ణ కలియుగ కర్ణుడు సినిమాలో రమేష్ బాబు పక్కన ఆమె అయితే సరిగ్గా సరిపోతుందని భావించి సినిమాలోకి తీసుకున్నాడట కృష్ణ. ఇలా ఇదే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జుహీచావ్లా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది.

Share post:

Latest