ఆ హీరోయిన్ తో రామ్ చరణ్ ఎఫైర్ …ఉపాసనకు షాక్ ?

రామ్ చరణ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో కి మెగా వారసుడిగా అడుగుపెట్టిన రామ్ చరణ్ చిరుత మూవీ తో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమాతోనే ఉత్తమ డెబ్యూ నటుడిగా గుర్తింపు పొందిన ఈయన ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్ చరణ్ అతి తక్కువ సమయంలోనే మంచి కలెక్షన్లను రాబట్టే సినిమాలలో నటించి మెగా పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇప్పటివరకు ఈయన నటించింది కేవలం 12 చిత్రాలే అయినప్పటికీ అందులో చాలా వరకూ కూడా మంచి విజయాన్ని సాధించినవే.

- Advertisement -

ప్రస్తుతం ఈయన తన తండ్రితో కలిసి ఆచార్య సినిమాలో నటించాడు.. ఈ సినిమా ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరొక పాన్ ఇండియా సినిమా రాజమౌళి దర్శకత్వం లో ఆర్ ఆర్ ఆర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇకపోతే క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా త్వరలోనే రెండవ షెడ్యూల్ ని కూడా ప్రారంభించబోతున్నారు రామ్ చరణ్. ఇదిలా ఉండగా రామ్ చరణ్ చిరుత సినిమాలో తనతో పాటు నటించిన నేహా శర్మ తో ఎఫైర్ పెట్టుకున్నాడు అనే వార్తలు వినిపించాయి.

అంతేకాదు చిరుత సినిమా తర్వాత నేహా శర్మ ను ఏకంగా రామ్ చరణ్ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు అనే వార్తలు కూడా వినిపించాయి. ఇక వార్తలు విన్న రామ్ చరణ్ షాక్ అవ్వడం తనకు తెలియకుండా ఇలాంటి రూమర్స్ ఎందుకు సృష్టిస్తున్నారో తెలియకపోవడం అన్నీ ఒక కథలా మిగిలిపోయాయి. ఇకపోతే ఒక ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ ఈ విషయంపై వివరణ కూడా ఇచ్చారు.. సినీ ఇండస్ట్రీలో మొదటి సారి రూమర్స్ అంటే ఎలా ఉంటాయో నాకు తెలిసి వచ్చింది ఇక నా గురించి అందరికీ తెలుసు కాబట్టి అమ్మానాన్న ఇండస్ట్రీలో ఇవన్నీ సహజం.. నువ్వేమి పట్టించుకోకు అని చెప్పేసారు.. ఇక నా స్నేహితులు కూడా ఇవన్నీ లైట్ తీసుకో అని ధైర్యం చెప్పారు. ఉపాసన కూడా మంచి సపోర్ట్ ఇవ్వడంతో ఆ రోజు నుంచి సినీ ఇండస్ట్రీలో ఎలాంటి రూమర్స్ వచ్చినా సరే ధైర్యంగా నిలదొక్కుకోగలిగాను అంటూ తెలిపాడు రామ్ చరణ్.

Share post:

Popular