ఈ ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ స్పూఫ్ …చూస్తే అందరు వావ్ అనాల్సిందే !

రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోస్ నటిస్తున్న పాన్ ఇండీయా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ గురించి అందరకి తెలిసిందే .ఈ చిత్రం జనవరి 7 న విడుదల అవాల్సింది,కానీ కరోనా వేరియంట్ ఓమిక్రాన్ వాళ్ళ ఆర్ఆర్ఆర్ రిలీజ్ పోస్ట్ పోనే అయ్యింది .ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా గత ఏడాది ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం . ఆ ట్రైలర్ ఎన్ని రికార్డు బ్రేక్ చేసిందో అందరికి తెలిసిందే.అయితే ఇలా సినిమా ట్రైలర్లతో కొంతమంది సూఫ్ఫ్ ట్రైలర్స్ చేస్తూ తమ టాలెంట్ ని సోషల్ మీడియాలో ద్వారా చూపిస్తూ క్రేజ్ సంపాదించుకోవడం మనకు తెలిసిందే .

ఒడిశాకి చెందిన కొంత మంది యువకులు ‘ఆర్ఆర్ఆర్’ట్రైలర్ ని స్పూఫ్ చేసి అందరి చేత వావ్ అనిపించుకున్నారు . ఈ ‘ఆర్ఆర్ఆర్’ స్పూఫ్ ట్రైలర్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఆ యువకులు , ఆ లింక్ ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు . అయితే ఆ స్పూఫ్ ట్రైలర్ చూసినా ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం ఆ యువకుల్ని ప్రశంసింది.అంతేకాకుండా మా కష్టాన్ని , మా సినిమా పై ఉన్న ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేసింది

‘ఆర్ఆర్ఆర్’ట్రైలర్ లో చూపించిన ప్రతి ఫ్రేమ్ ని ఆ యువకులు వాళ్ళ స్టైల్ లో చుపంచి వావ్ అనిపించారు ,అంతేకాకుండా ఆ ట్రైలర్ కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆ స్పూఫ్ ట్రైలర్ ఆఖరిలో చూపించారు . ఈ యువకులు ఇంతకముందు సూపర్ హిట్ సినిమాలకు ఇలాగె స్పూఫ్ లలు చేశారు .రీసెంట్గా వచ్చిన అల్లు అర్జున్ ‘పుష్ప ‘ట్రైలర్ స్పూఫ్ కూడా చేశారు .ఇంకెందుకు ఆలస్యం ఈ యువకులు చేసిన స్పూఫ్ ట్రైలర్స్ చూసేయండి .

Share post:

Popular