అవకాశాలు లేక అలాంటి వ్యాపారం మొదలు పెట్టిన ఎన్టీఆర్ హీరోయిన్..!!

సినీ పరిశ్రమ అనేది కేవలం రంగుల ప్రపంచమే కాదు మాయా ప్రపంచం కూడా.. ఇటువంటి మాయ లోకంలో ఎంతో మంది నటులు నటిస్తూనే ఉన్నారు. అలా వచ్చిన వారు స్టార్ హీరోల పొజిషన్ లో కొంత మంది ఉండగా.. మరికొంతమంది అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. మిగిలిన కొంతమంది అడపాదడపా సినిమాలు చేస్తూ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే అవకాశాలు లేక కొంతమంది ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి నటులలో హీరోయిన్ అంకిత కూడా ఒకరు.

అంకిత తన వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె ముంబైలో జన్మించింది.. తన మూడేళ్ల వయసులోనే రస్నా వ్యాపార ప్రకటనలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అంతేకాదు ఆమె మరికొన్ని యాడ్ లలో నటించింది. ఈ ముద్దుగుమ్మ వై.వి.యస్.చౌదరి డైరెక్షన్లో .. తెరకెక్కించిన లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమాతో మొదటిసారిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. తన మొదటి సినిమా ఎంతో ఘన విజయాన్ని సాధించడంతో ఆమె కు తెలుగులో వెంట వెంటనే అవకాశాలు వెలువడ్డాయి. ఇక ఆ తరువాత స్టార్ డైరెక్టర్ స్టార్ హీరో కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా అంకితం కు రెండవ మూవీ. ఈ సినిమా 2003 వ సంవత్సరంలో విడుదలై మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

సింహాద్రి సినిమా తర్వాత స్టేట్ రౌడీ, విజయేంద్ర వర్మ, సీతా రాముడు ఇంకా మిగిలిన సినిమాలలో నటించింది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ.. ఎక్కువగా హీరోయిన్లు చేసే తప్పు ఏమిటంటే.. కథలు ఎంపిక చేసుకోవడంలో ఇప్పుడు పొరపాటు చేస్తూ ఉంటారు.. అలా ఈమె కూడా ఆ తప్పు చేయడంతో కెరియర్ క్రమంగా డౌన్ అయిపోయింది.ఇక అవకాశాలు రాకపోవడంతో పుణేకు చెందిన బిజినెస్ మాన్.. విశాల్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతోంది. ప్రస్తుతం వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. అంకిత ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే మరొకవైపు తన తండ్రికి ఉన్న డైమండ్ వ్యాపారాన్ని చూసుకుంటూ ఉంది.

Share post:

Latest