టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో స్టైలిష్ విలన్స్..

బాహుబలి సినిమా అనంతం.. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పాన్ ఇండియన్ సినిమాల మీదే కన్నేసింది. చాలా మంది హీరోలు సైతం పాన్ ఇండియన్ సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అటు ఈ సినిమాల్లో హీరోలను ఢీకొట్టే విలన్లను ఎంపిక చేయడం ఫిల్మ్ మేకర్స్ కు సవాల్ గా మారింది. పక్క సినిమా పరిశ్రమలకు చెందిన స్టైలిష్ విలన్లను టాలీవుడ్ సినిమాలకు ఫిక్స్ చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ లో ఈ మూవీ సెట్స్ మీదకు రానుంది. పాన్ ఇండియన్ టచ్ ఇస్తున్న ఈ సినిమాలో విలన్ గా సునీల్ శెట్టిని ఓకే చేసినట్లు తెలుస్తోంది. అటు మహేష్ తో సినిమా చేయబోతున్నరాజమౌళి ఏకంగా తమిళ స్టార్ హీరో విక్రమ్ ను విలన్ గా మార్చబోతున్నాడట.

అటు హరీష్ శంకర్.. పవన్ కల్యాణ్ తో కలిసి భవధీయుడు అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో విలన్ గా విజయ్ సేతుపతిని అనుకుంటున్నాడట. ఇప్పటికే ఈ విషయం గురించి విజయ్ కి చెప్పాడట. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం చెప్పలేదట. అటు బాలయ్య తర్వాత సినిమాలో విలన్ గా దునియా విజయ్ ని ఫిక్స్ చేశారు. గోపిచంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ దునియా నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. అటు రవితేజ కిలాడీ మూవీలో మలయాళీ స్టార్ హీరో ముకుందన్ నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడట. అటు రావణాసుర సినమాలో సుశాంత్ విలన్ గా కనిపిస్తాడట. అటు రవితేజ మరో మూవీ రామారావ్ ఆన డ్యూటీ సినిమాలో వేణు విలన్ గా చేస్తున్నాడట. రవితేజ ఇంకో మూవీ ధమాకాలో అర్జున్, అనసూయ నెగెటివ్ రోల్స్ చేస్తున్నారట. అటు ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ ను ఢీకొట్టే క్యారెక్టర్ సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నాడట. సలార్ మూవీలో మలయాళీ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపిస్తాడట.

అటు విజయ్ దేవరకొండ లైగర్ మూవీలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీ రోల్ చేస్తున్నాడట. ఇందులో ఆయనది నెగెటివ్ క్యారెక్టర్ అట. అటు రామ్, లింగుస్వామి కాంబోలో వస్తున్న మూవీ వారియర్. ఈ సినిమాలో ఆది పినిశెట్టి స్టైలిష్ విలన్ గా కనిపిస్తాడట. అటు పుష్ప-2లో ఫహాద్ ఫాజిల్ విలనిజంతో ఆకట్టుకోబోతున్నాడట. ఆచార్యలో సోనూసూద్.. సర్కారు వారి పాటలో సముద్రఖని.. భీమ్లా నాయక్ లో రానా నెగెటివ్ రోల్స్ చేస్తున్నారట.

Share post:

Popular