నెగిటివ్ రోల్స్ కి సైతం ఒకే అంటున్న స్టార్ హీరోయిన్స్!

థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు వెండితెరపై హీరోయిన్లు కనిపించగానే వారి అందం అభినయం చూసి ఊహాలోకంలో కి వెళ్ళి పోతూ ఉంటారు ప్రేక్షకులు. ఇక మరికొంతమంది హీరోయిన్లు గ్లామర్ పాత్రలు చేసి అందరి మతి పోగొడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు కొంత మంది భామలు మాత్రం అందాల ఆరబోత చేయడమే కాదు అందరిని భయపెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం అంటూ చెబుతున్నారు. మొన్నటి వరకు కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం అయిన వారు ఇక ఇప్పుడు విలన్ పాత్రలు చేస్తూ తమ తో ప్రేక్షకులను తమ విలనిజంతో భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు.. మంచి పాత్ర రావాలే కానీ నెగటివ్ రోల్స్ చేయడానికి మేము రెడీ అంటూ చెప్పేస్తున్నారు.

ఇలా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మొన్నటి వరకూ క్యూట్ క్యూట్ అందాలతో ప్రేక్షకులను అందరినీ కూడా మురిపించి మైమరిపించిన హీరోయిన్లు.. ఇక ఇప్పుడు విలన్ పాత్రలకు రెడీ అయిపోతున్నారు. అలాంటి హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.

 

దక్ష నగార్కర్ : ఎంతో క్యూట్ గా కనిపించే ఈ అమ్మడు ఇప్పుడు లేడి విలన్ గా మారబోతుంది. సుధీర్వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రావణాసుర సినిమా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోంది ఈ అమ్మడు. ఇక ఈ పాత్ర ఆమెకు ఎంతో గుర్తింపు తీసుకు రాబోతుంది అని అటు సినీ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

వరలక్ష్మి శరత్ కుమార్ : ప్రస్తుతం పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ పాత్రలో నటించింది అంటే పాత్రలో ఒదిగిపోతూ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది . లేడీ విలన్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అనే తేడా లేకుండా మంచి ఛాన్స్ దొరికితే చాలు సై అంటూ చేసేస్తోంది. సర్కార్, పందెంకోడి 2, తెనాలి రామకృష్ణ లాంటి సినిమాలతో నెగిటివ్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇటీవలే క్రాక్ సినిమాతో జయమ్మ పాత్రలో కూడా అదరగొట్టింది. ఇక ఇప్పుడు బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకుడు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలోనూ మరో నెగెటివ్ రోల్ లో నటించబోతున్నాడు

 

 

యాంకర్ అనసూయ : ఇప్పుడు వరకు ఎంటర్టైన్మెంట్ అందించే పాత్రలో నటించిన అనసూయ పుష్ప సినిమాతో ఒక్కసారిగా విలన్ అవతారమెత్తింది. ఇక తన నటనతో అందరినీ భయపెట్టింది అనసూయ. పుష్ప పార్ట్ 2 సినిమాలో అనసూయ విలనిజం మరింత భయంకరంగా కనిపించబోతుంది అని తెలుస్తుంది. ఇక మరోవైపు తన 50వ సినిమాలో తనని తాను ప్రేక్షకులకు సరికొత్త గా చూపించాలనే ఉత్సాహంతో నెగిటివ్ రోల్ లో నటించింది హన్సిక. మహా సినిమాలో హన్సిక విలన్ పాత్రలో నటించింది.ఇక ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు ఈ యేడాది ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు.

సమంత : ఇక ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు గ్లామర్ పాత్రల్లో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఫ్యామిలీ మ్యాన్ 2 సినిమాలో విలనిజంతో అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. ఇక ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ లో కరీనాకపూర్ నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు ఈశ గుప్త కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నారు. ఇలా ఒకప్పుడు తన గ్లామర్ తో ఆలరించిన ఈ ముద్దుగుమ్మలు ఇప్పుడు విలనిజంతో భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

Share post:

Latest