కొండంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ.. ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఎందుకని హీరో కాలేకపోయాడు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. దశాబ్దాల నుంచి ఈ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది ప్రముఖుల చిత్ర పరిశ్రమలో సేవలందిస్తున్నారు. మూవీ మొఘల్ గా పేరొందిన రామానాయుడు ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమ సేవలందించి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును దక్కించుకున్నారు. ఇప్పుడు ఆయన వారసులు వెంకటేష్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతుండగా.. సురేష్ బాబు ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేష్ హీరో గా ఎంట్రీ ఇచ్చారు. కానీ సురేష్ బాబు మాత్రం కేవలం ప్రొడ్యూసర్ గా మాత్రమే ఎందుకు మిగిలిపోయాడు.

దీంతో భారీ బ్యాక్గ్రౌండ్ వున్నప్పటికీ సురేష్ బాబు హీరో ఎందుకు కాలేకపోయాడు అన్నది మాత్రం చాలామందికి తెలియని ప్రశ్న. ఈ క్రమంలోనే సురేష్ బాబు ఎక్కడికి వెళ్లిన ఇలాంటి ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇలాంటి ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు సురేష్ బాబు. తన తండ్రి రామానాయుడు సినిమాల్లో తనను హీరోగా పరిచయం చేయాలని ప్రయత్నించిన.. తనకు మాత్రం మొదటినుంచి నిర్మాణ రంగం పైనే ఆసక్తి ఉండేదని.. అందుకే ఇటువైపుగా వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. నటుడిగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ నటన వైపు అడుగులు వేయలేదు అంటూ సురేష్ బాబు చెప్పుకొచ్చారు. ముందు నుంచి నిర్మాణరంగం పైన ఆసక్తి ఉందని.. ఇక ఇప్పుడు నేను సాధించింది కూడా ఇదే అంటూ తెలిపారు.

ఇక చిన్నప్పుడు మా పిన్ని భర్త తాగడం తో ఆమె జీవితం నాణ్యమైంది. ఇది చూసిన తర్వాత జీవితంలో ఎప్పుడూ తాగకూడదు అని నిర్ణయించుకున్న.. చెడు అలవాట్లకు దూరంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు అయన. ఎంతో మంది తో సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉన్నా భార్యను మోసం చేయకూడదు అని పెళ్లికి ముందే ఫిక్స్ అయ్యాను. అందుకే ఎవరితో ఏఫైర్ పెట్టుకో లేదని చెప్పుకొచ్చారు. నా భార్య వేరొకరితో ఎఫైర్ పెట్టుకుంటే తట్టుకునే శక్తి ఉంటే… నేను కూడా వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకోవాలని అనుకున్నాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు. ఏదేమైనా సురేష్ బాబు ఎందుకు హీరో కాలేకపోయాడు అన్న విషయంపై మాత్రం పూర్తి క్లారిటీ ఇచ్చారు.