చిరు ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు ..సీనియర్ హీరోయిన్..!!

జయసుధ.. ఆనాటి కాలంలో కూడా తెలుగు హీరోయిన్ లు ఎక్కువగా గ్లామర్ షోలను ప్రదర్శించేవారు. జయసుధ మాత్రం గ్లామర్ షోలను ప్రదర్శించిన ప్పటికీ అందం, అభినయం లో ఏమాత్రం తీసిపోకుండా సహజ నటన ఉట్టిపడేలా నటించడం ఆమె నైజం.. అందుకే అందరూ సహజనటి అని అభివర్ణిస్తారు. తమిళ సినీ ఇండస్ట్రీలో తన సత్తా చాటిన జయసుధ తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ ,ఏఎన్నార్, కృష్ణంరాజు ,కృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన నటించి సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఈమె నటించే దాదాపు అన్ని సినిమాల్లో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి.

ఈమె ఏ పాత్రలో నటించినా ఆ పాత్ర సహజత్వం ఉట్టిపడేలా ఉండడంతో ప్రతి ఒక్కరూ ఈమెను తమ సొంత ఇంటి ఆవిడలాగే చూస్తూ ఉండడం గమనార్హం. జయసుధ సినిమాలు ఇప్పుడు బుల్లితెరపై కనిపించినా ఆ నాటి ప్రేక్షకుల నుంచి నేటి యువత కూడా ఈమె సినిమాలు చక్కగా చూస్తారు. హీరోయిన్ గా మంచి స్టార్ డమ్ ను అనుభవించిన ఈమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మాతగా మాత్రం సక్సెస్ కాలేకపోయింది.. తాజాగా అందుకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించింది.

నిర్మాతగా మారి చేసిన తొలి చిత్రం ‘ఆత్మ బంధువులు’. నేను, నాగేశ్వ‌ర‌రావుగారు న‌టిస్తే.. దాస‌రి నారాయ‌ణ‌రావుగారు డైరెక్ట్ చేశారు. ఆ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. త‌ర్వాత ‘కాంచ‌న సీత‌’ సినిమా చేశాం. అందులో ర‌ఘు వ‌ర‌న్‌ను ప‌రిచ‌యం చేశాం. దాన్ని కూడా దాస‌రిగారే డైరెక్ట్ చేశారు.హిందీలో సినిమా చేద్దామ‌నుకున్నాం. ‘మేరా ప‌తి సిర్ఫ్ మేరా హై’ అని జితేంద్ర‌గారితో చేశాం. ఇక ఈ సినిమా ఫ్లాప్ ను చవి చూసింది. తర్వాత వింత కోడలు సినిమా చేద్దాం అది కూడా ఫ్లాప్ అయి పోయింది ఇక హాలీవుడ్ రేంజ్లో బేస్ చేసుకొని అదృష్టం అనే సినిమాను తెరకెక్కించాను. ఇక తెలుగు అంచనాలను సరిగ్గా మెప్పించలేక పోవడం వల్ల ఈ సినిమా కూడా ఫ్లాప్ ను చవి చూసింది.

చిరంజీవి వల్ల కూడా ఆర్థికంగా నష్టపోయాను అంటూ ఆమె వెల్లడించింది.చివ‌రగా ‘హ్యాండ్స‌ప్’ సినిమా చేశాం. అందులో చిరంజీవిగారు ఓ చిన్న క్యారెక్ట‌ర్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యే వ‌ర‌కు అందులో ఆయ‌న ఉన్నార‌ని ఎవ‌రికీ తెలియ‌లేదు. ఆయ‌న పోస్ట‌ర్ వేసినా ఓపెనింగ్స్ వ‌చ్చేవి ఏమో..కానీ పోస్టర్ వేద్దామంటే చిరంజీవి వద్దన్నారు..కారణం.. అప్ప‌టి వ‌ర‌కు మ‌న తెలుగు సినిమాల్లో స్టార్స్ స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ట‌చ్ లేదు. ఒక‌వేళ పోస్ట‌ర్ వేసి పెద్ద క్యారెక్ట‌ర్ ఉంటుంద‌నుకుని ఆడియెన్స్ వ‌స్తారు. మా హీరో చిన్న రోల్‌లో చేశాడ‌ని ఫీల్ అవుతార‌ని భావించి చిరంజీవిగారు వ‌ద్దు. వ‌చ్చిన త‌ర్వాత ఆడియెన్స్‌కి స‌ర్‌ప్రైజ్ ఉంటుందని అనుకునన్నారు. కానీ.. ఆయన ఆలోచన రివ‌ర్స్ కొట్టింది. సినిమాకు ఓపెనింగ్స్ లేవు. దాంతో హాండ్స్ అప్ సినిమాకు పూర్తిగా నష్టపోయారు నిర్మాతలు. ఆ రోజు ఆయన మేము చెప్పిన మాట విని ఉంటే ఆరోజు ఆర్థికంగా మంచి గుర్తింపు వచ్చేది అంటూ ఆమె తెలిపింది..

Share post:

Popular