హీరో సురేష్ తో నదియాకు పెళ్లా. అప్పట్లో వచ్చిన ఈ వార్తల్లో నిజం ఎంత?

సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ కి కొదవలేదు. ఎప్పుడూ ఏదో ఒక పుకారు షికారు చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మాత్రమే కాదు కొన్ని దశాబ్దాల క్రితం కూడా ఇలాంటి పుకార్లు షికారు చేసాయి అని చెప్పాలి. హీరో హీరోయిన్లు కలిసి రెండు మూడు సినిమాల్లో నటించారు అంటే ఇక వారి మధ్య ప్రేమ చిగురించిందని మరి కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తూ ఉంటాయి. కేవలం హీరో హీరోయిన్ల మధ్య కాదు.. దర్శకుడు ఒకే హీరోయిన్ ని రెండు మూడు సినిమాల్లో సెలెక్ట్ చేసుకున్న ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి.

గతంలో ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో బాలయ్య విజయశాంతి, చిరంజీవి రాధిక.. ఇక ఇటీవల కాలంలో ప్రభాస్ అనుష్క ఇలాంటి వారిపై ఎంతలా గాసిప్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇటీవలి కాలంలో అమ్మ అత్త పాత్రల్లో నటించి తన అందం అభినయంతో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూన్న నదియా ఒకప్పుడు హీరోయిన్ గ కూడా అలరించింది. అయితే అప్పట్లో హీరో సురేష్ తో కలిసి నదియా ప్రేమలో మునిగితేలుతోంది అంటూ ప్రచారం జరిగింది. ఎక్కడ చూసినా ఇదే వార్తలు చక్కర్లు కొడుతూ ఉండేది. ఈ పుకార్లకు కారణం వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా హిట్ కావడంతో దర్శకనిర్మాతలు వీరి కాంబినేషన్లో వరుసగా సినిమాలు తీయడమే.

ఇక నదియా, సురేష్ ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రశ్నలు అడిగేవారు మీడియా. ఒక సమయంలో ఈ విషయంపై స్పందించిన సురేష్ మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే… మా మధ్య ప్రేమ లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత ఒకే హీరోయిన్తో కాకుండా తన సినిమాల్లో హీరోయిన్లను మారుస్తూ వచ్చాడు సురేష్. కొన్ని కొన్ని సార్లు నదియాతో కలిసి నటించే అవకాశం వచ్చిన పుకార్ల నేపథ్యంలో ఒప్పుకోలేదట.. ఇక ఆ తర్వాత ఒకప్పటి హీరోయిన్ అనిత రెడ్డి ని పెళ్లి చేసుకున్నాడు సురేష్. నదియా 1988 లో శిరీష్ అనే ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది.

Share post:

Popular