హీరో మోజులో కెరీర్ పాడు చేసుకున్న కమెడియన్..

సినిమా పరిశ్రమలో కమెడియన్స్ గా గుర్తింపు పొందిన చాలా మంది నెమ్మదిగా హీరోలుగా మారారు. వాస్తవానికి కమెడియన్స్ హీరోలుగా మారడం ఎప్పటి నుంచో ఉన్నది. నాటి పద్మనాభం నుంచి నేటి బ్రహ్మానందం వరకు చాలా మంది కమెడియన్స్ గా మంచి స్వింగ్ ఉన్న సమయంలోనే హీరోలుగా నటించారు. అలీ లాంటి నటుడు మంచి విజయాలను కూడా అందుకున్నాడు. అయితే కమెడియన్స్ స్టార్ హీరోలుగా స్థిరపడిన సందర్భాలు చాలా తక్కువ. కొంత కాలం పాటే వారి హవా.. ఆ తర్వాత సక్సెస్ కాలేకపోతున్నారు.

తెలుగు సినిమా పరిశ్రమలో అలీ, సునీల్ హీరోలుగా కాస్త ఫర్వాలేదు అనిపించారు. సునీల్ అయితే హీరోగా మారిన తర్వాత వరుస సినిమాలు చేశాడు. అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస పరాభవాలతో కెరీర్ ఫేడౌట్ అయ్యే పరిస్థికి వచ్చింది. దీంతో తను క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. విలన్ పాత్రలు కూడా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేసి మెప్పించాడు సునీల్.

టాలీవుడ్ లో హీరోగా ఎదిగేందుకు బాగా ప్రయత్నిస్తున్నాడు కమెడియన్ సప్తగిరి. పలు సినిమాల్లో ఈయన మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో కమెడియన్ గా మంచి క్లిక్ అందుకున్నాడు. ఒకానొక సమయంలో ఏడాదికి 20 సినిమాల్లో నటించే అవకాశాన్ని అందుకున్నాడు. అదే సమయంలో తనకు హీరోగా అవకాశాలు వచ్చాయి. అయితే ఒకటి రెండు సినిమాలు హీరోగా చేసిన తర్వాత తనకు అవకాశాలు రావడం మానేశాయి. హీరో అవకాశాలు అటుంచి కమెడియన్ పాత్రలు కూడా రావడం లేదు. మొత్తంగా తను హీరోగా మారి తన కెరీర్ కు పెద్ద దెబ్బ తెచ్చుకున్నాడు. సునీల్ కూడా ఒకప్పుడు ఏడాది 30 సినిమాలు చేసేవాడు. కానీ హీరో అయ్యాక చాలా వరకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో కమెడియన్ గానే మళ్లీ స్థిరపడేందుకు సప్తగిరి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest