“సేనాపతి ” సినిమాపై చిరంజీవి రివ్యూ కేక ..!

కరోనా పుణ్యమాని సినిమా థియేటర్స్ మూతపడిని తరువాత ,ఓటీటీ హావ మొదలైంది .చిన్న సినిమాలు ,పెద్ద సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి .ఒకరకంగా చిన్న సినిమాలను ఓటీటీ బ్రతికించింది. రీసెంట్ గా ఓటిటి లో పలు ఆసక్తికర సినిమాలే రిలీజ్ అవుతూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరి అలా మన తెలుగుకి చెందిన ఓటిటి ప్లాట్ ఫామ్ “ఆహా” లో కూడా కొన్ని సినిమాలు వస్తున్నాయి.ఆహాఓటీటీ గత కొన్ని రోజులు కితమే రిలీజ్ అయ్యిన ఇంటెన్స్ థ్రిల్లర్ చిత్రం “సేనాపతి”.

సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో యంగ్ దర్శకుడు పవన్ సాదినేని తెరకెక్కించిన ఈ చిత్రంతో వీక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి టాలీవుడ్ మెగా హీరో మెగాస్టార్ చిరంజీవి తన అద్భుత రివ్యూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఒక్కసారి చిరంజీవి ఏమన్నారో చూద్దాం :

“సేనాపతి చూశాను . యువ దర్శకుడు పవన్ సది నేని ఎంతో ఆసక్తికరంగా , అనుక్షణం ఏం జరుగుతుందోననే ఉత్కంఠభరితంగా ఉండేలా తీశాడు.మంచి అభిరుచికి అద్దంపట్టే చిత్రాన్ని నిర్మించిన యువనిర్మాతలు సుష్మిత కొణిదెల, విష్ణులకి నా ప్రేమాభినందనలు.అన్నింటికీ మించి సీనియర్ నటుడు ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ ఒక వినూత్న పాత్ర అద్భుతంగా నటించాడు.

తన నటనా ప్రతిభ కి ఈ చిత్రం ఓ మచ్చు తునక. ఈ ప్రయత్నం వెనుక వున్న’గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ ‘టీం అందరికీ నా శుభాకాంక్షలు! ‘ఆహా’ ఓటిటి ప్లాట్ ఫార్మ్ లో విడుదలైన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని భావిస్తున్నాను.” అని చిరు తన స్పందనను తెలియజేసారు.

Share post:

Latest