నెటిజన్లతో ఘోరంగా తిట్లుతిన్న బాలీవుడ్ బ్యూటీస్..

సినిమా జనాలు ఏది చేసినా వింతగానే ఉంటుంది. వారి ప్రతి కదలికను ఎంతో జాగ్రత్తగా గమనిస్తారు ప్రజలు. వారు స్టైలిష్ గా కనిపించినా.. ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకున్నా.. అందాలను ఆరబోసినా.. ఏం చేసినా హెడ్ లైన్స్ లోనే ఉంటారు. అయితే ఒక్కోసారి హీరోయిన్ వేసుకునే డ్రెస్సులు విపరీతమైన ట్రోలింగ్స్ కు గురవుతారు. తాజాగా డ్రెస్ సెన్స్ లేదంటూ పలువురు ముద్దుగుమ్మలపై మండిపడుతున్నారు జనాలు. కొత్తగా ఉంటుందనో.. డిఫరెంట్ గా ఉంటుందనో వేసుకున్న డ్రెస్సులు బూమరాంగ్ అవుతున్నాయి. ఇవేం డ్రెస్సులు అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. తాజాగా కన్నడ బ్యూటీ రష్మిక మందాన ఇలాగే నెటిజన్ల చేత తిట్లు తిన్నది. ఎయిర్ పోర్టులో అసలు షార్ట్స్ కనిపించకుండా వేసుకున్న స్వెట్ డ్రెస్ ని చూసి.. డ్రెస్ బాగా చిన్నదైంది.. రష్మికకి స్టైల్ బాగా ఎక్కువైంది అంటూ ట్రోల్ చేశారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు పెద్దగా ఇలాంటి డ్రెస్సులు వేసుకోకపోయినా.. బాలీవుడ్ లో కురుచ దుస్తులు వేసుకుని ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా ఎక్స్ పోజ్ చేస్తారు. ఇలా చాలా మంది బాలీవుడ్ భామలు సరిగా డ్రెస్సులు సరిగ్గా వేసుకోక బోలెడన్ని తిట్లు తిన్న సందర్భాలున్నాయి. తాజాగా దీపికా పదుకొనే ఈ లిస్టులో చేరింది. అల్ట్రా మోడర్న్ డ్రెస్ లతో అదరగొట్టే ఈ అమ్మడు.. సినిమా ప్రమోషన్ కు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చింది. ఆమె డ్రెస్ గురించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నెటిజన్లు.

అటు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే సైతం నెటిజన్లకు దొరికింది. తన అప్ కమింగ్ మూవీ గెహరాయియా అనే మూవీ ప్రమోషన్స్ కి అటెండ్ అయ్యింది. అనన్య వేసుకున్న డ్రెస్ చూసి అందరూ ఇదే డ్రెస్ అంటూ అక్కడున్న వాళ్లే మండిపడ్డారు. అటు నెటిజన్లు ఊరుకుంటారా? బ్రౌన్ కలర్ టాప్, స్కిన్ కలర్ కాంబినేషన్ బాటమ్ వేసుకున్న అనన్యని ఓ ఆట ఆడుకున్నారు. ఇంత కన్నా మంచి డ్రెస్ దొరకలేదా? నువ్ చిన్న పిల్లవా? అంటూ మండిపడ్డారు.

Share post:

Latest