అల్లు అర్జున్ డైట్ ప్లాన్ మాములుగా లేదు గా ?

మంచి సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన నటుడు అల్లు అర్జున్. అద్భుత నటనతో పలు సినిమాల్లో నటించి మంచి జనాదరణ అందుకున్నాడు. స్టైలిష్ స్టార్ గా, ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. భిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్నాడు. తాజాగా ఆయన నటించిన పుష్ప సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను అల్లు అర్జున్ ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలో పుష్ప-2 విడుదల కానుంది.

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు అల్లు అర్జున్. ఆహార నియమాలు తప్పకుండా పాటిస్తాడు. మంచి ఫిట్ నెస్ కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. పొద్దున్నే నిద్ర లేవగడానే సుమారు గంట పు త్రెడ్ మిల్ మీద రన్నింగ్ చేస్తాడు. ఆ తర్వాత కాఫీ లేదంటే జ్యూస్ తీసుకుంటాడు. ఏడున్నర నుంచి ఎనిమిది వరకు నాలుగు గుడ్లతో ఆమ్లెట్ వేసుకుని బ్రేక్ ఫాస్ట్ చేస్తాడు. 11 నుంచి 12 గంటల మధ్యలో లంచ్ కి ముందుగా సూప్, గ్రీన్ సలాడ్ తీసుకుంటాడు. అందులో ప్రొటీన్స్ కోసం ఎగ్ లేదంటే చికెన్ ఉండేలా చూసుకుంటాడు. మధ్యాన్ని 1 నుంచి 2 లోపు మాంసం, కార్బో హైడ్రేట్స్ తో లంచ్ తీసుకుంటాడు.

సాయంత్రం నాలుగున్నర నుంచి 5 గంటల మధ్యలో ఉడక బెట్టిన గింజలు, కాఫీ లేదంటే జ్యూస్ తీసుకుంటాడు. బ్రౌన్ రైస్, కూరగాయలు, చికెన్, చేపలతో డిన్నర్ కంప్లీట్ చేస్తాడు. జున్ను, పాల పదార్థాలను దాదాపు దూరంగా పెట్టేశాడు. తన పద్దతైన డైట్ కొనసాగిస్తున్నాడు. చక్కటి ఫిట్ నెస్ మెయింటెయిన్ చేస్తున్నాడు. గతంలో కూడా ఆయన మంచి శరీర ధారుడ్యాన్ని అందుకునేందుకు గంటల తరబడి జిమ్ లో గడిపాడు. నెమ్మదిగా సిక్స్ ఫ్యాక్ సాధించాడు. ఈ నేపథ్యంలో తను ప్రస్తుతం ఉన్న బాడీని ఫిట్ గా కాపాడుకునేందుకు మాత్రమే వ్యాయామం చేస్తున్నాడు. మంచి ఆరోగ్యంగా ఉంటున్నాడు.

Share post:

Latest