టైటానిక్ ప్రేమ కథను తలపిస్తున్న రాధే శ్యామ్ సెకండ్ సింగిల్..!!

ప్రముఖ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నిర్మిస్తున్న చిత్రం రాధే శ్యామ్.. ఈ సినిమాను చరిత్రలో మిగిలి పోయేలాగా టైటానిక్ ప్రేమ కథకు మించి హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు టీజర్లు విడుదల అయి ప్రేక్షకుల అనూహ్యమైన స్పందన పొందుతున్నాయి. తాజాగా రెండవ పాటలు కూడా విడుదల చేసి ప్రేక్షకులకు ఈ సినిమా పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతి సీను కూడా ఎంతో జాగ్రత్తగా అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా ను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది చిత్రబృందం. ఇందులో భాగంగా ఇటీవలే ఫస్ట్ సింగిల్ ‘ఈ రాతలే’ లిరికల్ వీడియో సాంగ్ వచ్చి యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇదే క్రమంలో ఇప్పుడు సెకండ్ సింగిల్ “నగుమోమూ తారలే ” అంటూ సాగే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

అంతేకాదు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్‌లోనూ ఈ సాంగ్ విడుదలై ఆకట్టుకుంటోంది. క్రేజీ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్‌కు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చారు. సాంగ్ మొత్తం మంచి విజువల్ ట్రీట్‌లా అనిపిస్తూ బాగా ట్రెండ్ అవుతోంది. అంతేకాదు విడుదలైన కొద్ది సమయానికే మంచి వ్యూస్ ను నమోదు చేసుకోవడం గమనార్హం.

Share post:

Latest