శ్యామ్ సింగరాయ్ మూవీపై..పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్స్..!

హీరోయిన్ పూనమ్ కౌర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే మొన్నటి వరకు పూనమ్ కౌర్ సోషల్ మీడియా కి దూరంగా ఉన్న.. కొద్ది రోజుల క్రితం జరిగిన మా ఎలక్షన్లో వ్యవహారంతో ఆమె మళ్లీ సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ తో అడుగు పెట్టింది. అయితే తాజాగా ఈమె ఒక సినిమా పై షాకింగ్ కామెంట్స్.. చేసింది వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

నాని హీరోగా, సాయి పల్లవి, కృతి శెట్టి, హీరోయిన్ గా, నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రాన్ని రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్టర్గా తెరకెక్కించారు. ఇది లవ్ స్టోరీ పీరియాడికల్ గా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాలో నాని రెండు పాత్రల్లో నటించాడు. ఇక ఈ సినిమా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది. అయితే తాజాగా ఈ సినిమాను తన కుటుంబ సభ్యులతో కలిసి చూసింది నటి పూనమ్ కౌర్. ఆ తర్వాత తన అభిప్రాయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందించింది.

https://www.instagram.com/p/CYDY0lAvvct/?utm_source=ig_web_copy_link

పూనమ్ కౌర్ తన సోషల్ మీడియాలో ఇలా తెలియజేసింది.. ఇటీవల కాలంలో చాలా నచ్చిన సినిమా ఇది అని తెలిపింది. ఈ సినిమా తనని చాలా చాలా తేలికగా వేరే టైమ్ జోన్ కి తీసుకెళ్ళింది అని తెలిపింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మకు ఈ సినిమాను చూపించినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది. సాయి పల్లవి ఈ సినిమాలో చాలా సహజం గా నటించిందని తెలియజేసింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్టు వైరల్ గా మారుతోంది.

Share post:

Popular