గుండెపై ప్రియురాలి పచ్చబొట్టు…. ఆమెకు సడన్ గా పెళ్లవడంతో ప్రియుడు..!

ప్రియురాలికి పెళ్లి కావడంతో మనస్థాపం చెందిన ప్రియుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన చిత్తూరు జిల్లా పీలేరు లో జరిగింది. తమిళనాడుకు చెందిన శేఖర్ కుటుంబం 30 ఏళ్ల కిందట పీలేరు లోని ఇందిరమ్మ కాలనీ కి వచ్చి అక్కడే స్థిరపడింది. శేఖర్ చిన్న కుమారుడు పయని (25) డిగ్రీ వరకు చదివాడు. కరోనా వైరస్ వ్యాప్తి ముందు వరకు చెన్నైలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు.

- Advertisement -

లాక్ డౌన్ ఈ సమయంలో ఇంటికి వచ్చిన పయని స్థానికంగా ఉంటూ ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అయితే అతడు చెన్నైలో ఉన్నప్పుడు ఒక యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ప్రేమించింది.

ఆ యువతి అంటే శేఖర్ కు ఎంత ప్రేమ అంటే.. ఆమె పేరు తన గుండెపై పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. కాగా ఇటీవల తను ప్రేమించిన అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నట్టుండి పెళ్లి చేశారు. విషయం తెలుసుకున్న శేఖర్ కుంగిపోయాడు. నాలుగు నెలలుగా ఒంటరితనంతో ఫీలవుతున్నాడు. ప్రియురాలి లేని జీవితం తనకు వద్దనుకున్న శేఖర్ ఇంట్లో ఉరేసుకున్నాడు. ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం పీలేరులో విషాదాన్ని నింపింది.

Share post:

Popular