బిగ్‌బాస్ ల‌వ‌ర్స్‌కి గుడ్‌న్యూస్‌.. సీజ‌న్ 6 స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 కూడా నిన్న‌టితో స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి అయింది. బుల్లితెర నటుడు సన్నీ విజేతగా ఈ సారి విజేత‌గా నిలిచి ట్రోఫీని అందుకున్నాడు. అలాగే రూ.50 లక్షల ప్రైజ్ మ‌నీ, సువర్ణభూమి ఇన్ ఫ్రా డెవలపర్స్ నుంచి రూ.25 లక్షల విలువ చేసే ప్లాట్ మ‌రియు టీవీఎస్ బైక్ కూడా స‌న్నీని వ‌రించాయి.

దీంతో బ‌య‌ట ఆయ‌న అభిమానులు ఆనందంతో సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ సీజ‌న్ 6 స్టార్ట్ అయ్యేది ఎప్పుడా అన్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విష‌యంపై హోస్ట్ నాగార్జున సూప‌ర్ క్లారిటీ ఇచ్చారు.

ఎవరూ విన్నర్‌, ఎవరూ రన్నర్‌ అనేది ప్రకటించిన అనంతరం నాగ్ మాట్లాడుతూ.. `సాధారణంగా ఒక సీజన్‌ అయిపోగానే కొత్త సీజన్‌ స్టార్ట్‌ అవ్వడానికి ఐదారు నెలలు పడుతుంది. కానీ ఈసారి మీకు మరింత వినోదం పంచేందుకు బిగ్‌బాస్ సీజ‌న్ 6 ముందే వ‌చ్చేస్తోంది.

కొత్త సంవత్సరం మొదలైన రెండు నెలలకు బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌ మొదలు కానుంది` అని తెలిపారు. అంటే ఈ లెక్క‌న‌ బిగ్‌బాస్ 6వ సీజ‌న్ మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఇది ఒక ర‌కంగా బిగ్ బాస్ ల‌వ‌ర్స్‌కి గుడ్‌న్యూసే. అందుకే వారు ప్ర‌స్తుతం ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

Share post:

Latest