దత్త కూతురితో బండ్ల గ‌ణేష్ ఆట‌లు.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

హాస్య న‌టుడిగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో గుర్తింపును సంపాదించుకున్న బండ్ల గ‌ణేస్‌.. 2009లో నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలు త‌దిత‌ర చిత్రాల‌ను నిర్మించి నిర్మాత‌గానూ స‌త్తా చాటుతున్నాడు. ప్ర‌స్తుతం బండ్ల గణేష్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అదే `డేగల బాబ్జి`.

వెంకట్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ సాధించిన `ఒత్త సేరుప్పు సైజ్ 7` కి రీమేక్‌. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. బండ్ల గ‌ణేష్ నేపాలీకి చెందిన‌ ఓ చిన్నారిని దత్తత తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌నే స్వ‌యంగా పంచుకున్నారు.

అందరూ కుక్కలు, పిల్లులను పెంచుకొని వాటికి చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారని, తాను మాత్రం ఈ పాపను పెంచుకొని, గొప్పగా చదివించాలనుకంటున్నట్లు తెలిపిన బండ్ల‌.. ఇప్పుడు ఆ పాప‌ తమ ఇంట్లో మెంబర్‌ అయిపోయింద‌ని ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అయితే ఆ పాప‌ను బండ్ల గ‌ణేష్‌ సొంత కూతురులా చూసుకుంటున్నాడు. ఆ పాప చేత స‌ర‌ద‌గా దెబ్బ‌లు తింటూ ఆమెతో తెగ ఆడుకుంటున్నాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు బండ్ల గ‌ణేష్ ఔధార్యంపై మ‌రోసారి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

https://twitter.com/ganeshbandla/status/1465234232096092166?s=20