`అఖండ` కోసం వ‌చ్చిన‌ అఘోరాలు..విశాఖ‌లో సంద‌డే సంద‌డి!

న‌ట‌సింహం నంమూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన `అఖండ‌` చిత్రం నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్ పాత్ర‌ను పోషించాడు.

జ‌గ‌ప‌తిబాబు, పూర్ణ‌లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల ఈ మూవీ సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఓవైపు మురళీ కృష్ణ అనే గ్రామ పెద్దగానూ.. మ‌రోవైపు అఖండ అనే అఘోర‌గానూ న‌టించి ప్రేక్ష‌కుల‌ను బాల‌య్య విప‌రీతంగా ఆక‌ట్టుకున్నారు. ఈ చిత్రం కేవలం ఇండియాలోనే కాకుండా యుఎస్ లోనూ బాక్సాఫీస్ వ‌ద్ద‌ ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది.

వరల్డ్ వైడ్‌గా 1550 కిపైగా థియేటర్లలో రిలీజైన అఖండ.. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాను వీక్షించేందుకు ఏకంగా అఘోరాలే క‌దిలి వ‌చ్చారు. అవును, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్ లో సందడి చేశారు.

అఘోరాలూ బాలయ్య ఫ్యాన్స్ అయ్యారంటూ అభిమానులు కేకలేశారు. పైగా సినిమా అనంతరం బాలయ్య అభిమానులతో అఘోరాలు కాసేపు ముచ్చటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Share post:

Popular