అషూ రెడ్డి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. టెక్సాస్‌లోని డల్లాస్‌లో సెటిల్ అయిన తెలుగు దంపతులకు జన్మించిన ఈ బొద్దుగుమ్మ.. అమెరికాలోనే ఎడ్యూకేషన్‌ను కంప్లీట్ చేసింది. ఆ తర్వాత నటనపై ఉన్న మక్కువతో ఇండియాకు వచ్చిన అషూ.. డబ్స్మాష్ వీడియోలతో జూనియర్ సమంతగా పాపులర్ అయింది.
ఈ క్రమంలో పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్‌ను పోషించిన అషూ రెడ్డి.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని సూపర్ క్రేజ్‌ను దక్కించుకుంది. బిగ్ బాస్ తర్వాత బుల్లితెరపై వరుస టీవీ షోలు, పలు సినిమాలు చేస్తూ బిజీగా మారిన అషూ రెడ్డి.. మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించి ఏదో ఒక క్రేజీ వీడియోతో వార్తల్లో నిలుస్తుంటుంది.
ఇందులో భాగంగా తాజాగా అషూ రెడ్డి తన తల్లితో ఓ ప్రాంక్ వీడియోను చేసింది. ఈ వీడియోలో తాను ప్రెగ్నెంట్ అని.. దానికి కారణాన్నిచెప్పకుండా.. బేబీని పెంచుకుంటానని అషూ చెప్పటంతో.. అది నిజమే అని నమ్మిన ఆమె తల్లి తీవ్ర ఆగ్రహానికి గురవుతుంది. ఈ క్రమంలోనే ఆమె అషూ రెడ్డిని చావు దెబ్బలు కొట్టి.. తండ్రికి చెబుతానని ఆవేశంగా ఊగిపోతుంది.
ఇక అప్పుడు అషూ రెడ్డి తాను చేసిందంతా ప్రాంక్ వీడియో అంటూ అసలు రహస్యాన్ని రివీల్ చేస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో తెగ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు అషూ రెడ్డిపై విమర్శలు కురిపిస్తున్నారు. తల్లిదండ్రులు ఎమోషన్స్‌తో ఆడుకుంటావా.. అని కొందరు, ఇలాంటి చెత్త ఐడియాలు ఎక్కడ నుంచి పట్టుకొచ్చావని మరి కొందరు కామెంట్స్ చేస్తూ అషూ రెడ్డిని ఆడేసుకుంటున్నారు.