పేరు మార్చుకున్న ఎలన్ మస్క్ .. ఎందుకంటే..?

ప్రపంచ అపేర కుబేరుడు తన యూజర్లకు అనుకోని షాక్ ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తాడు.తన అధికారిక ట్విట్టర్‌లో ఎలన్‌మస్క్‌ తన డిస్‌ప్లే పేరును మార్చుకున్నాడు. ఎలన్‌మస్క్‌ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ కంపెనీల యజమాని ఎలన్‌మస్క్‌. అయితే ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ అయిన టెస్లాలో ఎలన్‌మస్క్‌కి 17 కోట్లకు పైగానే షేర్లు ఉన్నాయి. కొన్ని ఇబ్బందుల కారణంగా రెండు రోజుల క్రితమే కొన్ని షేర్లను అమ్మేయాలని భావిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఉన్నటుండి అకస్మాత్తుగా ట్విట్టర్‌లో తన డిస్‌ప్లే పేరును ఎలన్‌ మస్క్‌ బదులుగా లార్డ్‌ ఎడ్జ్‌ గా మార్చేసుకున్నారు. ఎలన్‌మస్క్‌కి ట్విట్టర్‌లో దాదాపు 60.20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే డిస్‌ప్లే పేరును మాత్రమే మార్చుకున్నారు కానీ డిస్‌ప్లే పిక్చర్‌ గా ఉన్న రాకెట్‌ను మాత్రం మార్చలేదు.అయితే ఇలా ఎందుకు పేరు మార్చుకుంటున్నారో అనే విషయం ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఇదిలా ఉండగా గతంలో కూడా అంటే 2019లో కూడా ట్విట్టర్‌ డిస్‌ప్లే నేమ్‌ని వన్ గా పెట్టుకుని అందరిని షాక్ కు గురి చేసాడు. సరిగ్గా మళ్ళీ ఇప్పుడు కూడా అలానే ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఎలన్‌ మస్క్‌.

Share post:

Popular