తన ప్రపంచాన్ని పరిచయం చేసిన గని

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్ర ‘గని’ ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనేక కారణాల వల్ల ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ ప్రొఫెషనల్ బాక్సర్‌గా మనకు కనిపించనున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఇటీవల ఈ సినిమా థీమ్ సాంగ్ కూడా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. వరుణ్ తేజ్ సూపర్ మేకోవర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారనుంది. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ చిత్రంలో కూడా పవన్ కళ్యాణ్ బాక్సింగ్ కోసం ఎలంటి ట్రెయినింగ్ తీసుకున్నాడో, ఇప్పుడు గని చిత్రంలో వరుణ్ తేజ్‌ను చూస్తూ అదే గుర్తుకు వస్తుంది. ఇక తాజాగా ఈ సినిమాలో గని ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు చిత్ర యూనిట్.

‘వరల్డ్ ఆఫ్ గని’ అంటూ నదియా, నరేష్, తనికెళ్ల భరణి, నవీన్ చంద్ర, సాయీ మంజ్రేకర్, సునీల్ శెట్టి, జగపతి బాబు, ఉపేంద్రలను చూపెట్టారు చిత్ర యూనిట్. అంటే ఈ సినిమాలో వరుణ్ తేజ్‌తో పాటు ఇతర కీలక పాత్రల్లో నటించేది వీరే అని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. మరి వీరి పాత్రలు ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాయో తెలయాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాను కిరణ్ కుర్రపాటి తెరకెక్కిస్తుండగా, అల్లు బాబీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.