విషాదంలో హీరోయిన్ త్రిష.. అసలేం జరిగిందంటే..!

సాధారణంగా ఇండస్ట్రీలో హీరో లేదా హీరోయిన్ కి ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఇలా అభిమానులు ఎవరికైతే ఎక్కువగా ఉంటారో అలాంటి వారికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు బాగా వస్తాయి. అయితే కరోనా కారణంగా అభిమానులకు, సెలబ్రిటీస్ కు మధ్య కాస్త దూరం పెరిగింది అని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గడంతో సెలబ్రిటీస్ సైతం వారి వారి షూటింగులో బిజీ అయ్యారు. కేవలం వీరు అభిమానులను సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడిస్తూ ఆనంద పరుస్తూవుంటారు.. ఇక హీరోయిన్ త్రిషకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అలాంటి అభిమానులలో కిషోర్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇక ఈ అభిమాని త్రిష కోసం ఎంతటి పనైనా చేస్తూ ఉంటాడు. త్రిష గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త పెడుతూ ఉంటాడు కిషోర్.

అలాంటి కిషోర్ కొన్ని అనివార్య కారణాలవల్ల మరణించడం జరిగింది. అయితే తన ఆత్మకు శాంతి కలగాలని కన్నీరు మున్నీరై పోస్టు పెట్టింది హీరోయిన్ త్రిష. ఇక ఈ వార్త విన్నప్పుడు నుంచి తనకు ఒక సోదరుడిని కోల్పోయాను అని బాధ మాత్రం మిగిలిందని తెలియజేసింది.

Share post:

Latest