ఎన్టీఆర్‌తో న‌టించ‌డానికి మూడు నెల‌ల ముందే డైలాగ్స్ ప్రాక్టీస్ చేసిన రాధ‌!

నంద‌మూరి తార‌క‌రామారావు.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన యుగపురుషుడు ఆయన. ఇక సినిమాల విషయానికి వస్తే ఆ తారక్ రాముడి స్థాయి అందుకోవడం ఎవ్వరికీ సాధ్యం అయ్యేది కాదు. ఎలాంటి జానర్ లో అయిన ఆయన నటన అనన్య సామాన్యం. అంతటి లెజండ్రీ యాక్టర్ పక్కన నటించాలని హీరోయిన్స్ అంతా కలలు కనడం సాధారణమైన విషయం. యన్టీఆర్ పక్కన యాక్ట్ చేయాలని సీనియర్ హీరోయిన్ రాధా కూడా ఇలానే చాలా కాలం ఎదురు చూసింది. కానీ.. చాలా కాలం పాటు ఆమెకి ఆ అదృష్టం దక్కలేదు. కానీ.., ‘చండ‌శాస‌నుడు’ సినిమా ద్వారా రాధని అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది.

యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘చండ‌శాస‌నుడు’. ఆయనే నిర్మాత. ఆయనే హీరో. అప్పట్లో ఇది అంతా పెద్ద రిస్క్ అన్నారు. కానీ.., పెద్దాయన మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలోనే ‘చండ‌శాస‌నుడు’ మూవీలో తన పక్కన యాక్ట్ చేయడానికి రాధని హీరోగా ఫైనల్ చేశారు యన్టీఆర్. పెద్దాయన పక్కన అవకాశం రావడం రాధకి ఆనందాన్ని కలిగించినా, ఆయనతో సమానంగా డైలాగ్స్ ఎలా చెప్పాలన్న ఆలోచనలో పడిపోయింది రాధ. ఇందుకోసం ఆమె ఓ ఉపాయాన్ని ఆలోచించుకుంది.

చండ‌శాస‌నుడు’ సినిమా షూటింగ్‌కు మూడు నెల‌ల ముందుగానే రాధ‌కు తన డైలాగ్స్ అన్నిటిని బట్టీ కొట్టేసింది. తెలుగు డైలాగ్స్‌ను ఆమె మ‌ల‌యాళంలో రాసుకొని ఆమె ప్రాక్టీస్ చేసింది. దీంతో.. దైర్యంగానే సెట్ లో అడుగు పెట్టింది రాధ. కానీ.. సెట్ లా సింహంలా ఉన్న యన్టీఆర్ పక్కన నటించడానికి రాధ బయపడిపోయింది. దీంతో.. డైలాగ్స్ అన్నీ మర్చిపోయింది. పైగా.. యన్టీఆర్ స్వయంగా డైరెక్టర్ కావడంతో ఆమె భయం రెండింతలు అయ్యింది. ఈ సమయంలో యన్టీఆర్ రాధ భయాన్ని పోగొట్టేలా ఆమెని ప్రోత్సహించారు. ఆ మూవీలో “ఏమీ.. ఏమేమీ..” అంటూ పౌరాణిక బాణీలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ త‌న‌దైన బాణీలో డైలాగ్స్ చెబుతూ వుంటే, అవే డైలాగ్స్ రాధ రిపీట్ చేసి, ఆయ‌నను వెక్కిరిస్తూ చెప్పే స‌న్నివేశం ఉంది. ఆమెకు నోరు తిరిగేది కాదు. ఎన్టీఆర్ ఓపిగ్గా “ఏం ఫ‌ర్వాలేదు.. నిదానంగా చెప్పు” అంటూ ధైర్యం చెప్పి రాధకి అండగా నిలిచారు. ఆ సమయంలో సీనియర్ హీరోయిన్ శారద కూడా రాధకి ధైర్యాన్ని నూరిపోయడం విశేషం. కానీ.., ఇక్కడ ట్విస్ట్ ఏమిటో తెలుసా? యన్టీఆర్ కి డైలాగులు మర్చిపోయే ఆర్టిస్ట్ లు అంటే అస్సలు నచ్చేవారు కాలేదు. అలాంటి వారితో కాంబినేషన్ సీన్స్ చేయడానికి ఆయన అస్సలు ఒప్పుకునేవారు కాదు. ఇలాంటిది రాధ కోసం ఆయన ఈ విషయంలో సర్ధుకునిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ.., సినిమా విడుదల తరువాత రాధ నటనకి మంచి పేరు రావడం విశేషం. మరి.. చూశారు కదా? ఈ విషయంలో యన్టీఆర్ మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Share post:

Latest