నమ్మిన వ్యక్తే నట్టేట ముంచాడు.. మిల్కీ బ్యూటీ ఎలా మోసపోయిందో తెలుసా?

సినిమా పరిశ్రమలో ప్రతి హీరోతో పాటు హీరోయిన్ కు మేనేజర్లు కచ్చితంగా ఉంటారు. రోజువారీ పనుల్లో అత్యంత బిజీగా ఉండే తారలు తమ తమ పనులను చక్కదిద్దేందుకు వీరి చాలా ఉపయోగపడుతారు. సినిమాల డేట్స్ విషయంతో పాటు ఆయా రకాల సంప్రదింపులు వీరే చూసుకుంటారు. దర్శక నిర్మాతలతో వీరే టచ్ లో ఉంటారు. ఫైనాన్షియల్ విషయాలకు కూడా వీరు చూస్తుంటారు. అయితే చాలా మంది హీరోయిన్లు బిజీగా ఉండటం మూలంగా తమ డబ్బుల విషయాన్ని వారికే అప్పగిస్తుంటారు. అయితే కొందరు మేనేజర్లు ఆయా హీరోయిన్ల నమ్మకాన్ని వమ్ము చేసిన సందర్భాలున్నాయి. అలా మోసపోయిన వారిలో తమన్నా కూడా ఉందట..

మిల్కీ బ్యూటీ తమన్నా.. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. పలు సినిమా ఆఫర్లతో మస్త్ బిజీగా ఉంది. తెలుగు, తమిళం, మలయాళంతో పాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటుతుంది. ఈ నేపథ్యంలో తన ఫైనాన్షియల్ వ్యవహారాలను సైతం మేనేజర్ కే అప్పగించింది ఈ ముద్దుగుమ్మ. అయితే నమ్మించి మోసం చేశాటడ మేనేజర్. ప్రభుత్వానికి కట్టాల్సిన టాక్సులను కట్టకుండా చేతివాటం చూపించాడట. అందినకాడికి నొక్కేశాడట.

కొద్ది రోజుల తర్వాత టాక్స్ విషయంలో జరిగిన లేట్ ను వివరిస్తూ ఇన్ కం టాక్స్ అధికారులు నోటీసులు పంపించారట. దీంతో తమన్నా ఒక్కసారిగా షాక్ అయ్యిందట. రెగ్యులర్ గా డబ్బులు చెల్లిస్తున్నా..నోటీసులు ఎందుకు వచ్చాయని అధికారులను అడిగిందట. ఆమె పూర్తి విషయాలను ఎంక్వయిరీ చేయగా అసలు విషయం బయటపడిందట. తను బాగా నమ్మిన మేనేజరే తనను మొసం చేశాడని గుర్తించిందట. చేసేదేంలేక ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బును కట్టిందట. ఆ తర్వాత ఫైనాన్షియల్ విషయాల్లో వేరొకరిని ఇన్వాల్వ్ కాకుండా చూసుకుంటుందట. అంటేకాదు సదరు మేనేజర్ ను తొలగించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. గతంలో మాదిరిగా కాకుండా ఆయా విషయాల గురించి ఓ కంట కనిపెడుతూ ఉంటుందట ఈ ముద్దుగుమ్మ. మళ్లీ మోసపోయే అవకాశం ఇవ్వకుండా చూసుకుంటుందట.

Share post:

Latest