1997 చిత్ర యూనిట్ సభ్యులను అభినందించిన ప్రకాష్ రాజ్?

డా. మోహన్ స్వీయ దర్శకత్వంలో డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 1997. ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. జీవిత కథ ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ మోషన్ పోస్టర్ విడుదల అయిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ సాంగ్ ఏమి బతుకు.. ఏమి బతుకు అన్న పాటకు మంచి స్పందన లభించింది.

తాజాగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ 1997 నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, డా మోహన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కించిన ఈ సినిమాలోని పాట విన్నాను, కథ గురించి తెలుసుకున్నాను.ప్రస్తుత రోజుల్లో నందిని బాధపడుతున్న సమస్య గురించి ఈ సినిమా తీశారు. ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా, నిజంగా ఇలాంటి ప్రయత్నం మంచి ప్రయత్నం చేసిన మోహన్ అండ్ టీమ్ నీ అభినందిస్తున్నాను అని తెలిపారు. అలాగే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాను అని తెలిపారు.