తన హిట్ బ్యానర్ లోనే మరో సినిమాకు సిద్ధమవుతున్న అనుష్క..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ స్టార్ హీరోయిన్ గా చెక్కుచెదరకుండా తన స్థానాన్ని పదిలం గా ఉంచుకుంది అనుష్క శెట్టి. ముఖ్యంగా ఒక సినిమాలో హీరోయిన్ పాత్ర ఎంత బలంగా ఉంటుందో, ఆ హీరోయిన్ పై సినిమా తీసిన అదే రేంజ్ లో ఉంటుందని చెప్పడానికి అనుష్క సినిమాలే నిదర్శనమని చెప్పవచ్చు. ఒక టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా తన చెరగని ముద్ర వేసుకుని అపారమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఈరోజు ఈమె పుట్టినరోజు సందర్భంగా ఈమె ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు..

- Advertisement -

ఈ స్పెషల్ డే అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. అయితే అనుష్క కొత్త ప్రాజెక్టు ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తుందని ఎదురు చూస్తూ ఉండటం తో అభిమానులకు ఈ రోజు గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు అనుష్క తన కొత్త ప్రాజెక్టును ఈరోజు వెల్లడించింది. తన సినీ కెరీర్లో సూపర్ హిట్స్ ఇచ్చినటువంటి యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై మరో సినిమా చేయడానికి సిద్ధమవుతోంది.

మిర్చి, భాగమతి లాంటి సినిమాల తర్వాత యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై మరో కథని విని చాలా ఇంప్రెస్ అయిన అందుకే తన నెక్స్ట్ ప్రాజెక్టును కూడా వీరితో చేయడానికి సిద్ధమవుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాను రా రా కృష్ణయ్య సినిమా దర్శకుడు మహేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Share post:

Popular