తనకంటే చిన్న వాడిని పెళ్లాడిన గాయని.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ సింగర్ మాళవిక సుందర్ తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తమిళంలో సూపర్ సింగర్ షో లో ప్లేబ్యాక్ సింగర్ గా అలరించిన ఈమె, తనంటే ఏంటో ప్రూవ్ చేసుకుంది.

అంతేకాకుండా తమిళంలో పాటు తెలుగులో వచ్చిన అనేక అవకాశాలను వినియోగించుకుంటూ ఇక్కడ కూడా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది. ఇప్పటివరకు తెలుగులో మాళవిక 200కు పైగా పాటలు పాడింది.

https://www.instagram.com/p/CWIsJXqPgUW/?utm_source=ig_web_copy_link

అయితే ఇటీవలే తాను తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ఫ్యాన్స్ కు హింట్ ఇచ్చింది. చెప్పిన విధంగానే ఎంటర్ ప్రెన్యూర్ అశ్విన్ కశ్యప్ రఘురామన్ తో కలిసి ఏడు అడుగులు వేసింది. అయితే మాళవికా కంటే కంటే అతడు వయసులో చిన్న వాడు కావడం గమనార్హం.

https://www.instagram.com/p/CWLQhYxp6zC/?utm_source=ig_web_copy_link

ప్రస్తుతం నెట్టింట్లో మాళవిక పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన మాళవిక కు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే పెళ్ళికి వయస్సుతో సంబంధం లేదని ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని గౌరవించుకుంటే అంతే చాలు అని చెప్పుకొచ్చింది.

Share post:

Popular