సుధీర్ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పాడా..అసలు నిజం ఇదే..!

బుల్లితెర పై ప్రసారమయ్యే  కామెడీ షోలలో జబర్దస్త్ షో కూడా ఒకటి.ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్ల గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో ముఖ్యంగా సుదీర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.సుధీర్,రష్మి జోడి కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక వీరిద్దరూ ఉన్నారు అంటే కచ్చితంగా అ షోకి టిఆర్పి రేటింగ్ టాప్ లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు.అయితే సుధీర్ జబర్దస్త్ కు గుడ్ బై చెబుతున్నాడనే వార్త బాగా వినిపిస్తోంది. వాటిలో నిజమెంత ఉందో ఇప్పుడు చూద్దాం.

అసలు విషయానికి వెళ్తే సుధీర్ తనను ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి.. జబర్దస్త్ కు మార్చమని కోరాడట. అందుకు జబర్దస్త్ నిర్వాహనలు చూసే వాళ్ళు నిరాకరించడంతో సుధీర్ అషోకు గుడ్ బై చెబుతున్నాడు అనే వార్త బాగా వినిపిస్తోంది. అయితే ఈటీవీలో ప్రసారమయ్యే మిగతా ప్రోగ్రాములలో సుధీర్ కనిపిస్తాడు అన్నట్లుగా సమాచారం. అయితే మల్లెమాల నిర్వాహకులు మాత్రం సుధీర్ షో వదిలి పోకుండా సంప్రదింపులు జరుపుతున్నారని వార్త వినిపిస్తోంది. ఒకవేళ సుదీర్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కు గుడ్ బై  చెప్తే ఇక అ షోకు భారీ నష్టం తప్పదని చెప్పవచ్చు. రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కొనసాగుతారా అనే వార్త కూడా వినిపిస్తోంది.. అయితే సుధీర్ ఈ వార్తపై ఎలా స్పందిస్తారో తెలియాలంటే కొద్దిరోజులాగాల్సిందే.