ఆ విషయంలో చాలా బాధ పడుతున్న ఎస్.ఎస్.థమన్ కారణం..?

మ్యూజిక్ సెన్సేషన్ గా టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ లలో ఎస్.ఎస్.థమన్ కూడా ఒకరు. ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు కూడా ఈయనే కావడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ,రవితేజ, బాలకృష్ణ , మహేష్ బాబు వంటి ఎంతో మంది పెద్ద పెద్ద హీరోల సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. అంతే కాదు అలా వైకుంఠపురం లో సినిమాలో నుంచి ఈయన జోరు మరింత పెరిగిందనే చెప్పాలి.. అంతే కాదు ఈయన కంపోజ్ చేస్తున్న చాలా పాటలు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టి ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.

ఇక థమన్ ఎందుకు బాధ పడుతున్నాడు అనే విషయానికి వస్తే, ఆయన ఎంతో నమ్మకంతో ఒక మంచి హిట్ అవుతుందనుకున్న సాంగ్ మాత్రం డిసప్పాయింట్ చేసిందట. ఇక ఆ పాట ఏదో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం అరవింద సమేత. ఇక ఇందులో యాడబోయినాడో అనే ఒక పాట కోసం చాలా కష్టపడ్డాడట.. వైజాగ్ నుంచి నికిత అనే అమ్మాయి ని పిలిపించి మరీ ఈ పాటను పాడించాడు.. నిజానికి ఈ పాట ట్యూన్ గానీ పాడడం కానీ చాలా కష్టమట. ఎంతో కష్టపడి కంపోజ్ చేసిన పాట పెద్దగా హిట్ అవకపోవడం తో చాలా బాధపడ్డాను అని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

Share post:

Latest