అత్యంత విషమంగా శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం.. ఆయన కుమారుడు కూడా అపస్మారక స్థితిలోనే..!

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కొద్దిరోజుల కిందట కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. నాలుగు రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. శివ శంకర్ మాస్టర్ ఊపిరితిత్తులకు 75% ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు ప్రకటించారు. శివ శంకర్ మాస్టర్ తో పాటు ఆయన భార్య, పెద్ద కుమారుడు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

ప్రస్తుతం ఆయన పెద్ద కుమారుడు అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన భార్య హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతోంది. ఆస్పత్రిలో తన తండ్రి చికిత్సకు డబ్బు భారీగా ఖర్చవుతోందని.. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆదుకోవాలని శివ శంకర్ మాస్టర్ చిన్న కొడుకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడు.

శివ శంకర్ మాస్టర్ దేశంలోని పది భాషల్లో 800కు పైగా సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అగ్ర హీరోలు నటించిన సినిమాలకు కొరియోగ్రఫీ అందించాడు. మగధీర సినిమాలో పంచదార బొమ్మ.. బొమ్మ.. అనే పాటకు అందించిన నృత్యానికి గాను జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. శివ శంకర్ మాస్టర్ పలు టీవీ షోల్లో కూడా హోస్ట్ గావ్యవహరించారు.

Share post:

Latest