సీతారామరాజు-కొమరం భీమ్ అడిగితే జగన్ అనుమతిస్తాడా…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రస్తుత సమస్యలలో ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల రేటు వ్యవహారం కూడా ఒకటి. ఒక విధంగా ఇది అతి పెద్ద సమస్యగా మారిపోయింది. టికెట్ రేటు పెంచకపోతే పెద్ద సినిమాలకు నష్టం వస్తుంది. అయినా కూడా టికెట్ల రేటు పెంపు విషయంలో జగన్ సానుకూలంగా లేరని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

RRR Movie vs AP Govt: ఏపీ ప్రభుత్వంపై కోర్టుకు RRR టీమ్... క్లారిటీ ఇచ్చిన దానయ్య... సీఎం జగన్ తో భేటీ...

దీంతో RRR నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ పెట్టడంతో ఈ అంశం మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అయితే దానయ్య మెసేజ్ లో ఒక కామెంట్ పెట్టాడు. అదేమిటంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ ను మా RRR టీం సభ్యులంతా కలసి మా పరిస్థితిని తెలియజేస్తామని తెలియజేశారు. మాకు న్యాయం జరిగేలా తనని పరిష్కారాన్ని కోరుతాము అంటు ఒక పోస్ట్ చేశాడు. ఇక RRR టీమ్ అంటే ఎన్టీఆర్-రామ్ చరణ్ కూడా కదా మరి ఎన్టీఆర్ చరణ్ కలిసి వెళ్తే జగన్ సినిమా టిక్కెట్ల రేట్లను పెంచుకోవటానికి అనుమతి ఇస్తారా అన్న విషయం బాగా ఆసక్తికరంగా మారుతోంది. అయితే ఈ విషయంపై జగన్ ఏం మాట్లాడుతారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.