చై తో విడాకుల తరువాత వారికి సపోర్ట్ చేస్తున్న సామ్.. ఎవరికో తెలుసా?

టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే ఈమె నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ ఈ జంట వివాహబంధానికి స్వస్తి పలికారు. ఇది ఈ విడాకుల వెనుక అసలు కారణం తెలియక ప్రేక్షకులు వారికి తోచిన విధంగా వార్తలను సృష్టించారు. ఈ క్రమంలోనే తప్పంతా కూడా సమంతది అన్నట్లు మాట్లాడారు. అంతేకాకుండా నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత, సమంత కు మరొకరితో సంబంధం ఉంది అంటూ వార్తలు వినిపించాయి.

ఈ వార్తలను కొట్టి పారేసిన సమంత వాటిలో నిజం లేదు అంటూ వాటిపై స్పందించింది. ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా తెలంగాణలో వివాహం చేసుకోబోతున్న గే కపుల్ గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వీరికి మద్దతుగా వారికి సపోర్ట్ చేస్తూ సమంత ట్వీట్ చేసింది. ఆ గే జంటకు కంగ్రాచ్యులేషన్స్ అని క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసింది. విడాకుల తర్వాత తొలిసారిగా సమంత వారికి సపోర్ట్ చేస్తుండటంతో దీని వెనుక ఏమైనా కారణం ఉందా అని నెటిజన్లు ఆరాధిస్తున్నారు. మొత్తానికి సమంతా ఈ విషయం పై స్పందించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.