సమంతను కాదని..చైతన్య కి సపోర్ట్ పూనమ్ ట్వీట్ వైరల్..!

నాగచైతన్యతో సమంత విడాకులు ప్రకటించిన తర్వాత సమంత ను నెటిజన్లు ఒక రేంజ్ లో ఆడుకున్నారు. ఇక అంతే కాకుండా ఆమెను బాగా ట్రోలింగ్ కు కూడా గురిచేశారు. ఇక ఇలా ఆమె కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పై కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇక ఈమెకు అక్కినేని కుటుంబానికి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుందనే వార్త బాగా వైరల్ కావడంతో సమంత కోపంతో ఊగిపోయి యూట్యూబ్ ఛానెల్స్ పై ఆమె కోర్టులో నష్టపరిహారం వేసింది.

అయితే ఆ ఛానల్ నిర్వాహకులు మాత్రం ఆమెకు క్షమాపణలు చెప్పి ఆ వీడియోను డిలీట్ చేశారు. ఇక ఆ తర్వాత కోర్టు కూడా సమంతకు సంబంధించి వ్యక్తిగత విషయాలను కూడా తనను పోస్ట్ చేయవద్దు అని తెలియజేసింది. అయితే ఆ తర్వాత సమంత కొన్ని టూర్లకు వెళ్లి ఆ ప్లేస్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేది.

తాజాగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారుతోంది. ఆ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆ పోస్ట్ ని డిలీట్ చేసింది. కానీ అందుకు సంబంధించిన స్క్రీన్షాట్ ఫోటోలను తీసి పెట్టారు నెటిజన్స్. విడాకుల అనంతరం నిజంగా మగవారికి బాధ ఉండదా ? కేవలం ఆడ‌వాళ్లే బాధ‌లు ప‌డ‌తారా ? కొంద‌రు ఆడ‌వాళ్లే మ‌గ‌వారిని మాట‌ల‌తో బాధిస్తారు. వారి వల్లే మగవారికి కఠిన పరిస్థితులు వస్తుంటాయి. ఈ సమాజమే పక్షపాతంతో వ్యవహరిస్తుందా ? అసలు ఇప్పటికీ మనం విడాకుల అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగామా ? విడాకులపై మనకు కచ్చితమైన ఆలోచ‌న‌ ఉందా ? అని ఆమె ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ చేసింది ? అన్న‌ది చర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల టాలీవుడ్‌లో విడాకులు తీసుకున్న జంట స‌మంత‌, చైతూనే. ఈ క్ర‌మంలో ఆమె చైతూను స‌పోర్ట్ చేస్తూ స‌మంత‌కు వ్య‌తిరేకంగా ఆ ట్వీట్ చేసింద‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

Share post:

Popular